Begin typing your search above and press return to search.
సుడి అంటే కేసీఆర్ దేనా?
By: Tupaki Desk | 11 Dec 2015 4:31 AM GMTఅదృష్టవంతుడ్ని ఎవరూ ఆపలేరంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతి చూస్తుంటే అలానే అనిపించక మానదు. కేంద్రం నుంచి కావాల్సినవి తీసుకునే విషయంలో పలు రాష్ట్రాలు కిందామీదా పడుతుంటే.. కేసీఆర్ కు మాత్రం హామీలు చాలా తేలిగ్గా వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం ఎవరితోనూ పేచీలు పెట్టుకునే సాహసం చేయలేని పరిస్థితి. రాష్ట్రాలతో సామరస్యంగా ముందుకెళ్లాల్సిందే. అత్యంత కీలకమైన బిల్లులు ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో.. రాష్ట్రాల్ని దువ్వే ప్రయత్నానికి కేంద్రం తెర తీసింది.
ముద్దు వచ్చినప్పుడే చంకనెక్కే తీరు తెలిసిన కేసీఆర్.. కేంద్రం అవసరాన్ని గుర్తించి.. తన డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. సమయం చూసి అడిగిన డిమాండ్ ను కేంద్రం కాదనలేని పరిస్థితి. దీంతో.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు పెద్ద ఎత్తున చేపడుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులకు సంబంధించిన భరోసా తాజాగా లభించింది. తెలంగాణ సర్కారు నిర్మించే డబుల్ బెడ్రూం ఇళ్లకు అవసరమైన సాయాన్ని కేంద్రం ఇస్తుందన్న హామీని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాజాగా స్పష్టం చేశారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు అవసరమైన నేపథ్యంలో.. కేంద్రం దన్నుతో తాను అనుకున్న పనిని చేసే వెసులుబాటు టీఆర్ ఎస్ సర్కారు లభిస్తుంది. దీంతో.. తెలంగాణలోని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం మరింత ఊపుతో ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ తీపి కబురుతో పాటు.. మెదక్ లో నిర్మించాలని భావిస్తున్న నిమ్జ్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. అంతేకాదు.. అంతర్జాతీయ ఔషద నగరికి కూడా నిమ్జ్ హోదా ఇచ్చేందుకు ఓకే చెప్పేసింది. ఇలా ఓకే రోజు ముచ్చటగా మూడు వరాలు పొందటం చూస్తే.. కేసీఆర్ సుడి ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థం కాక మానదు.