Begin typing your search above and press return to search.
రంగు ఏదైనా లైట్ తీసుకుంటున్న వెంకయ్య
By: Tupaki Desk | 10 Jan 2016 6:40 AM GMTపరిస్థితులు మారిపోయాయి. గతంలో లైట్ తీసుకున్న అంశాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. ప్రతి చిన్న విషయాన్ని అందరూ నిశితంగా పరిశీలిస్తున్న వేళ.. ప్రముఖులు ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. అయితే.. అలాంటివేమీ పట్టించుకోకుండా తనదైన దారిలో దూసుకెళుతున్నారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్యన చేపట్టిన ఆయుత చండీయాగానికి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన గులాబీరంగు కండువాను నిండుగా కప్పుకొని యాగ పూజ క్రతువులో పాల్గొన్నారు. నిత్యం వైట్ అండ్ వైట్ లో కనిపించే ఈ కరుడు గట్టిన కాషాయపార్టీకి చెందిన వెంకయ్య లాంటి నేత భుజం మీద గులాబీ కండువా మెరిసిపోయింది. భిన్నమైన రంగు కండువా కావటం.. అందునా తెలంగాణ అధికారపక్షానికి చెందిన రంగు కండువా కావటం పలువురి దృష్టిని ఆకర్షించింది. కానీ.. అదేమీ పట్టించుకోనట్లుగా వెంకయ్యనాయుడు వ్యవహరించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఇలాంటి పనే మరోసారి చేశారు. ఆదివారం ఉదయం విజయవాడలో ప్రారంభమైన అమరావతి మారథాన్ లో ఆయన పసుపు పచ్చ టీషర్ట్ వేసుకొని హాజరయ్యారు. నిత్యం పంచెకండువాతో దర్శనమిచ్చే వెంకయ్య పసుపుపచ్చ టీ షర్ట్ తో దర్శనమివ్వటం పలువురిని ఆకర్షించింది. మారథాన్ లో భాగంగా కాసింత దూరాన్ని నడిచారు. కొసమెరుపు ఏమిటంటే.. పచ్చ తమ్ముడైన ఎంపీ కేశినేని నాని ఏమో తెల్లరంగు టీ షర్ట్ వేసుకొని వస్తే.. వెంకయ్యమాత్రం అందుకు భిన్నంగా పసుపు టీ షర్ట్ తో రావటం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ విషయాన్ని వెంకయ్య పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు.