Begin typing your search above and press return to search.

అక్టోబరు 2న రికార్డు సృష్టించిన కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   4 Oct 2016 4:56 AM GMT
అక్టోబరు 2న రికార్డు సృష్టించిన కేంద్రమంత్రి
X
కేవలం ఒక్కరోజులో ఒక కేంద్రమంత్రి ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొనే వీలుంటుంది? అంటే.. నాలుగైదు కార్యక్రమాల్లో అని టక్కున చెప్పేస్తారు. ఇంకాస్త అంటే.. ఆరేడు కార్యక్రమాలుగా చెప్పొచ్చు. కానీ.. అంతకుమించి అన్నట్లుగా ఒక కేంద్రమంత్రి వ్యవహరించారు. ఆయనెవరో కాదు... మన వెంకయ్యనాయుడు.

అక్టోబరు 2వ తేదీన మహాత్మగాంధీ జయంతి - లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా.. వారిద్దరి సమాధులున్న రాజ్ ఘాట్.. విజయ్ ఘాట్ ల వద్ద వెంకయ్య నివాళులు అర్పించారు. అనంతరం న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్ ర్యాలీని ప్రారంభించి ప్రసంగించారు. సిరిఫోర్డ్ ఆడిటోరియంలో స్వచ్ఛభారత్ పై తీసిన పది షార్ట్ ఫిలింస్ ను చూసి.. అవార్డులు ప్రదానం చేశారు.

అనంతరం సినీనటుడు అమితాబ్ తో కలిసి ఒక టీవీ ఛానల్ లో చర్చలో పాల్గొన్న ఆయన.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడితో ఆగలేదు. తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి.. కేంద్రమంత్రితో కలిసి పోరుబందరులో జరిగిన ఒక సభకు హాజరయ్యారు. ఆ తర్వాత టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హాతో కలిసి స్వచ్ఛభారత్ పై పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. చివరకు సాయంత్రం వేళ జరిగిన సఫాయిగిరి కార్యక్రమానికి హాజరై.. అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. తెలుగు ప్రాంతానికి చెందిన వెంకయ్యనాయుడు... అలుపు ఎరుగని తీరులో అనుక్షణం కష్టపడతారని చెప్పే ఉదాహరణ ఇది అని బీజేపీ నేతలు అభినందించారు. నిజమే ఇది అందరికీ సాధ్యం కాని విషయమే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/