Begin typing your search above and press return to search.
బాబు సంబరంపై నీళ్లు చల్లిన వెంకయ్య
By: Tupaki Desk | 29 Oct 2016 11:07 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్సాహంపై బీజేపీ సీనియర్ నేత - కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నీళ్లు చల్లే ప్రకటన చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అదేంటి సఖ్యత ఉన్న నాయకులుగా పేరున్నవెంకయ్య-చంద్రబాబు మధ్య ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే సందేహానికి రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరమైన సమాధానం ఇస్తున్నారు. సీఆర్ డీఎ పరిధిలోని లింగాయపాలెం గ్రామంలో ప్రభుత్వ పరిపాలనా భవనాల సముదాయ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి శంఖుస్థాపన చేసిన సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తనకు రాజకీయంగా వారసులెవరూ లేరని ప్రకటించారు. తాను బతికున్నంతకాలం తన తరపున ఎవరూ రాజకీయాల్లోకి రారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఘంటాపధంగా చెప్పారు.
అయితే వెంకయ్య నాయుడు ప్రకటన వెనుక ఇటీవల జరిగిన కొత్త చర్చనే కారణమని తెలుస్తోంది. నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (నుడా) ఏర్పాటు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. ఇంతకాలం నుడా ఏర్పాటుపై ప్రభుత్వం ఎప్పటికప్పడు దాటవేత ధోరణిలో ఉంటూ వచ్చింది. ఇటీవల నుడాను ఏర్పాటు చేసేందుకు అన్ని సన్నాహాలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక వెంకయ్య కుటుంబంలో వారసులను తెరమీదకు తీసుకురావడమే కారణమని తెలుస్తోంది. నుడాకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో, ఎప్పట్నుంచో ఈ పదవిపై ఆశ పెట్టుకున్న కొందరు టీడీపీ నేతలు ఎదురుచూస్తుండగా, అనూహ్యంగా వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. టీడీపీకి చెందిన కొందరు నేతలు ఈ పదవిని వెంకయ్య కూతురుకు అప్పగించే దిశగా అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ప్రచారం మొదలుపెట్టారు. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత బీద మస్తాన్ రావు - టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి - నెల్లూరు లోక్ సభ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి - తాళ్లపాక అనూరాధలు అసంతృప్తికి గురైనట్లు సమాచారం. వీరితోపాటు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు ఉన్న డాక్టర్ జెడ్.శివప్రసాద్ పేరు కూడా అప్పుడప్పుడు ఈ పదవి కోసం వినిపిస్తూనే ఉంది. కోటంరెడ్డి కూడా నుడా పదవి ఆశిస్తున్నప్పటికి, ముఖ్యమంత్రి వియ్యంకుడు - సినీనటుడు బాలకృష్ణ అండదండలతో త్వరలో ఈయనకు రాష్టస్థ్రాయి నామినేటెడ్ పదవి వచ్చే అవకాశం ఉందనే ధీమాతో ఆయన అనుచరులు ఉన్నారు.
ఇలా తెలుగుదేశంలోనే భారీ పోటీ నెలకొన్న నేపథ్యాన్ని స్థానిక బీజేపీ వర్గాలు వెంకయ్య సన్నిహితుల వద్దకు చేరవేయగా...ఇప్పటికే వారసుల తెరంగేట్రంపై సంశయంలో ఉన్న వెంకయ్య ఈ విషయంలో వెనక్కుతగ్గారని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబుకు తెలియజేసేందుకే సభా ముఖంగా తన వారసులు రాజకీయాల్లోకి రారని ఆయన ప్రకటించినట్లు చెబుతున్నారు. తద్వారా ఏపీ సర్కారు ఉత్సాహానికి బ్రేకులు వేసినట్లయిందని చర్చించుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/