Begin typing your search above and press return to search.
వెంకయ్య హర్టయితే..విందు రద్దవుతుందంతే
By: Tupaki Desk | 20 March 2018 3:12 PM GMTకేంద్ర ప్రభుత్వంపై టీడీపీ - వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే పార్లమెంట్ లో వాయిదాల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వివిధ డిమాండ్లపై ఆయా పార్టీల సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేయడంతో ఉభయ సభల్లో ఎటువంటి కార్యకలాపాలు కొనసాగలేదు. దీంతో వరుసగా 12వ రోజు సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. పెద్దల సభగా పేరున్న రాజ్యసభ సైతం ఇదే రీతిలో పరినామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు హర్టయ్యారు. ఏకంగా విందును రద్దు చేశారు.
రాజ్యసభ సభ్యులకు నేడు విందు ఇచ్చేందుకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సిద్ధమయ్యారు. అయితే గత 12 రోజులుగా సభ సక్రమంగా సాగనందుకు తీవ్ర అసంతృప్తికి లోనయిన వెంకయ్య విందును రద్దు చేశారు. విందు ఏర్పాట్లు గత వారమే పూర్తయ్యాయి. విందు గురించిన సమాచారాన్ని రాష్ట్రపతి - ప్రధానమంత్రి - సభలో ప్రతిపక్ష నాయకుడు - సభ్యులతో చర్చించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య విందుకు రావాల్సిందిగా కోరారు. కాగా ప్రతిపక్ష సభ్యుల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో సమావేశాలు సాగని పరిస్థితి నెలకొనడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సభ్యులకు ఇచ్చే విందును రద్దు చేశారు. కాగా, ఉప రాష్ట్రపతి నిర్ణయం ఆసక్తికరంగా మారింది.