Begin typing your search above and press return to search.

వెంకయ్య మాట: అంతకు మించి...

By:  Tupaki Desk   |   3 Sep 2016 4:39 AM GMT
వెంకయ్య మాట: అంతకు మించి...
X
ఏపీకి ప్రతేయ్క హోదా అనే అంశంపై ఎన్ని రకాల హడావిడి చేసినా - ప్రజలను ఎన్ని విధాలుగా మభ్యపెట్టినా - కొన్ని పత్రికల్లో కథనాలు వండి వడ్డించినా... ప్రత్యేక హోదా అయితే రాదని తేలిపోయినట్లే! ఇప్పటికే ఈ విషయంపై ఏపీవాసులకు ఒకరకమైన క్లారిటీ ఉన్నప్పటికీ.. కేంద్రంలోని మంత్రులు - ఏపీలోని అధికారపక్ష నేతలు గత రెండు మూడు రోజులుగా చేస్తున్న హడావిడి చూసి.. ఏమో వస్తుందేమో.. రావొచ్చేమో.. ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అని భావించారు. అయితే తాజాగా వెంకయ్య నాయుడు ఇచ్చిన క్లారిటీతో ఏపీ వాసులకు క్లారిటీ వచ్చి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాను మించిన సాయం (ప్రత్యేక హోదా మాత్రం కాదని చెప్పకనే చెబుతూ) అందించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్నారు. పీఐబీ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ప్రాంతీయ సంపాదకుల సదస్సులో "తిరంగా యాత్ర" వీడియోను విడుదల చేసే సందర్భంగా తెలుగు మీడియా సంపాదకులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్న వెంకయ్య.. తెలుగు రాష్ట్రాలు - ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై మాట్లాడారు. హోదా అంశాన్ని విభజన సమయంలోనే తేల్చి ఉండాల్సిందని, కేవలం నోటి మాటతోనే సరిపెట్టారని యూపీఏ సర్కారుపై మండిపడ్డారు. అయితే హోదా అనే అంశం లేవనెత్తిందీ, ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాశాలు ఇచ్చింది ఎవరనేది వెంకయ్య మరిచిపోయినా, ఏపీ ప్రజలు మాత్రం మరిచిపోలేదు అనే విషయం వెంకయ్య మరిచిపోకూడదు.

ఇదే సమయంలో.. ప్రతీ ఒక్కరూ ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా అని నినదిస్తున్నారని, దాని వల్ల ప్రయోజనం అంత గొప్పగా ఏమీ ఉండదని, ఇంతకు ముందు కొతగా ఏర్పడిన రాష్ట్రాల్లోకి వెళ్లి చూస్తే ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనం ఏపాటిదో తెలుస్తుందని చెప్పారు. అయితే.. అలా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల గురించి ఎన్నికల సమయంలో వెంకయ్య గారికి తెలియదా, అంతకు ముందు చూడలేదా? అంటే వెంకయ్య గారు ఏమంటారో మరి!