Begin typing your search above and press return to search.

వెంకయ్యకు ఎవరు వెనకున్నా వణుకేనట

By:  Tupaki Desk   |   1 April 2017 5:05 AM GMT
వెంకయ్యకు ఎవరు వెనకున్నా వణుకేనట
X
మాటల్ని తిప్పేసి మాట్లాడే విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి ఎంత అద్భుతమైన కళ ఉందో దేశ ప్రజలందరికి తెలుసు. భాష ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా విలక్షణమైన అంత్యప్రాసలతో మాట్లాడే ఆయన..కేంద్రంలోని మోడీ సర్కారులో కీలకభూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ దగ్గర ఇన్ ఫ్లుయన్స్ ఉన్న తెలుగోడు ఎవరైనా ఉన్నారంటే.. వెంకయ్య పేరే మొదట వినిపిస్తుంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జాన్ జిగిరీగా వ్యవహరించే వెంకయ్య తాజాగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తన వెనుక ఎవరున్నా తనకు ఇష్టం ఉండదంటూ.. అందుకు కారణం ఏమిటో తెలుసా?అంటూ ఆయన చెప్పిన ఉదాహరణ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చంద్రబాబు గురించే ఆయన చెప్పటం.. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చెప్పుకునే బాబు వెన్నుపోటు ఎపిసోడ్ పై వెంకయ్య చేసిన వ్యాఖ్యలు వింటే.. బాబు ఎంత డేంజర్ అన్న భావన కలగటం ఖాయం.

ఇంతకీ ఆయన అన్న మాటలేమిటంటే.. 1984లో ఎన్టీఆర్ కు వెనుకున్న వారే ఆయన్ను వెన్నుపోటు పొడిచారని.. అప్పటి నుంచి తనకు అనుమానమేనని.. అందుకే ఎవరైనా ముందే ఉండాలని.. వెనుక ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఎవరైనా సరే నా ముందు ఉంటే నేను ధైర్యంగా ఉండొచ్చన్న వెంకయ్య మాటలు విన్నప్పుడు.. గతం తాలూకు గురుతులు బాగా పచ్చిగానే వెంకయ్య మనసులో ఉన్నట్లుగా అనిపించకమానదు. ఐదేళ్లలో ఏపీకి కేంద్రం రూ.3.25లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లుగా చెప్పారు. వెనకున్న వారితోనే ఇబ్బంది అనిచెప్పిన వెంకయ్య.. ఏపీ అభివృద్ధిలో బాబు వెనుక ఉన్న వెంకయ్య.. ఆయన మాదిరే ఏపీ ప్రత్యేక హోదాకు వెన్నుపోటు పొడవటంపై ఏమంటారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/