Begin typing your search above and press return to search.
నేటి శృంగారరసంపై వెంకయ్య హాట్ కామెంట్!
By: Tupaki Desk | 29 Sep 2016 4:26 AM GMTఏ విషయం మాట్లాడినా ఆ విషయంలో తనదైన ప్రాసల పరంపరను కొనసాగించే వెంకయ్య నాయుడు... తాజాగా నేటి హీరో హీరోయిన్ల ముఖకవళికలో ప్రేమభావం గురించి, శృంగార రసం గురించి తనదైన శైలిలో స్పందించారు. ఒకప్పుడు సినిమాలో హీరోహీరోయిన్లు ఒకరినొకరు కనీసం తాకకుండానే ముఖకవళికలతో ప్రేమభావాన్ని అద్భుతంగా పలికించేవారని, ఇప్పుడేమో ఒకరినొకరు తాకినా - పీకినా - గోకినా కూడా శృంగార రసాన్ని పలికించలేకపోతున్నారని బీజేపీ నేత వెంకయ్య నాయుడు అన్నారు.
రామోజీ ఫిలిం సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండీవుడ్ కార్నివాల్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు సంస్థల యజమాని రామోజీరావుకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య ప్రేమభావం - శృంగార రసంలపై ఆ విదంగా స్పందించారు. ఇదే సమయంలో... 2014లో రూ.126 బిలియన్లు ఉన్న భారతీయ సినీ పరిశ్రమ విలువ - 2019 నాటికి రూ.204 బిలియన్లు అవుతుందని ఫిక్కీ అంచనా వేసిందని తెలిపారు. ఈ లెక్కన చూసుకుంటే భవిష్యత్తులో ఇండియన్ సినిమా ప్రపంచ సినీ పరిశ్రమకు మార్గదర్శకత్వం వహిస్తుందని, ప్రపంచస్థాయికి ఎదిగే సత్తా దానికి ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి సినీ పరిశ్రమ ప్రముఖులు - నటీనటులు హాజరయ్యారు. వారిలో విదేశీ ప్రతినిధులనుద్దేశించి మాట్లాడిన వెంకయ్య... ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని - వినోదం ఇవ్వాలని - మీరంతా బాగా సంపాదించుకోండని అన్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత్ - సినిమాల నిర్మాణంలోనూ అగ్రస్థానమేనన్నారు. ఇదే సమయంలో పాటలనూ ప్రస్థావించిన వెంకయ్య... నేటి పాటల్లో సంగీతం - సాహిత్యం తగ్గి వాయిద్యం ఎక్కువైందని - సినిమాలు మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలని వెంకయ్య కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/