Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కి అందుకే వెన్నుపోటు....వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   24 Dec 2022 4:45 PM GMT
ఎన్టీఆర్ కి అందుకే వెన్నుపోటు....వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
X
ఎన్టీఆర్ ఒక తరానికి దేవుడు. ప్రస్తుత తరానికి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మంచి నాయకుడు.అన్ని తరాలకూ ఆయన ఒక స్పూర్తి. ఎన్టీఆర్ లాంటి వారు ఈ గడ్డ మీద పుట్టారు ఎన్నో విజయాలను అనితరసాధ్యంగా సాధించారు అంటే రేపటి వారికి ఒక చరిత్రగా ఉంటుంది.

అలాంటి ఎన్టీఆర్ తో కలసి రాజకీయాల్లో పనిచేసిన వారు మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. ఆయన యువ ఎమ్మెల్యేగా ఉండగా ఎన్టీఆర్ ఫస్ట్ టైం సీఎం అయ్యారు. 1984లో ఎన్టీఆర్ కి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిస్తే ప్రజా ఆందోళన ఉవ్వెత్తున లేచింది. నాడు ఎన్టీఆర్ ని వెన్నుదన్నుగా ఉండి తిరిగి ముఖ్యమంత్రి పదవిని సాధించేవరకూ అండగా ఉన్న వారు వెంకయ్యనాయుడు.

ఇక రెండవసారి ఎన్టీఆర్ కి వెన్నుపోటు 1995లో జరిగింది. ఇలా తన జీవితంలో రెండు వెన్నుపోట్లకు ఎన్టీఆర్ గురి అయ్యారు. తొలిసారి తిరిగి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నా రెండవసారి ఆయన ఆయుస్షు తీరిపోవడంతో పై లోకాలకు తరలిపోయారు. లేకపోతే ఆయన మళ్ళీ నిలిచి గెలిచేవారు అన్న భావన అయితే అందరిలో ఉంది.

ఇక ఎన్టీఆర్ దగ్గరుండి చూసిన నాయకుడిగా వెంకయ్యనాయుడు తన అభిప్రాయలను తాజాగా తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భగ్నా గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయ విప్లవాన్ని సృష్టించారు అని కొనియాడారు. ఆయన బోళా మనిషి.ఆయన రాజకీయంగా అమాయకుడు. అందరినీ నమ్మేవారు. అందుకే ఆయనను వెన్నుపోటు పొడిచారు అని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ కి ఎవరి మీద చెడు అభిప్రాయం అన్నది లేనే లేదని అన్నారు. ఆయన నిజాయతీగా ఉండేవారని అందుకే తన సొంత వారు చేసిన కుట్రలను కుతంత్రాలను కూడా గమనించలేకపోయారని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. ఆయనకు తన వారు అంటే ఉన్న గుడ్డి నమ్మకం వల్లనే ఆయన వెన్నుపోటుకు గురి అయ్యారని అన్నారు.

మొత్తానికి చూస్తే అతి మంచితనం, అమాయకత్వం, బోళాతనం అందరికీ ఊరకే నమ్మేయడం వల్లనే ఎన్టీఆర్ కీయంగా దెబ్బ తిన్నారన్నది వెంకయ్యనాయుడు భావనగా చూడాలి.ఇదే మాటను గతంలో చాలా మంది అన్నారు. ఎన్టీఆర్ ని దగ్గరగా చూసిన వారు సైతం అదే మాటను అంటారు. ఎన్టీఆర్ కి ముక్కుసూటితనం తప్ప మరోటి తెలియదు. ఆయన ఎవరినీ కూడా అనుమానించే రకం కాదు. మరి ప్రేమించి దగ్గరకు తీసుకున్న పాపానికే ఆయన రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందిలో పడి అర్ధాంతరంగా తనువు చాలించారు అన్నది తెలుగు వారి గాఢమైన భావన. దాన్నే వెంకయ్యనాయుడు కూడా చెప్పారు అని అనుకోవాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.