Begin typing your search above and press return to search.
ఇదేంది వెంకయ్య సారూ.. సోము కుమిలిపోరా!!
By: Tupaki Desk | 5 Oct 2022 2:30 AM GMTబీజేపీ సీనియర్ నాయకుడు.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఏం మాట్లాడినా.. అర్థం పరమార్థం ఉంటాయి. పైగా.. ఆయన ఫక్తు ఆర్ ఎస్ ఎస్ వాది. కలలో కూడా బీజేపీకి హాని చేసే లక్షణం ఉన్న నాయకుడిగా.. ఆయనను అస్సలు ఊహించలే రు. అయితే.. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీని ఇరకాటంలోకి నెట్టేశాయి. దీంతో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కక్కలేక.. మింగలేక ఇబ్బంది పడుతున్నారట.
ఇంతకీ.. వెంకయ్య ఏమన్నారంటే.. ప్రస్తుతం ఆయన నెల్లూరులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు, మంత్రు లు.. ఎంపీలు.. గడపగడకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే.. ఇది పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించే కార్యక్రమం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకితీసుకువెళ్లి.. వచ్చే ఎన్నికల్లో పార్టీకి లబ్ధిని చేకూర్చే కార్యక్రమం. దీనివెనుక చాలా స్కెచ్ ఉంది.
అందుకే.. దీనికి పోటీగా.. బీజేపీ కూడా.. ప్రజాపోరుయాత్రలు చేస్తోంది. అంతేకాదు.. వైసీపీ ప్రభుత్వంపైనా.. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గడపగడపకు వెళ్తున్న వైసీపీ నాయకులను ప్రజలు చీత్కరించుకుంటున్నారని.. స్వయంగా సోము వ్యాఖ్యానించా రు. ఇక, ఇతర నేతలు కూడా.. గడపగడప కార్యక్రమంపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల ఆగ్రహంతో వైసీపీ వచ్చే ఎన్నికల్లో భగభగ కాలిపోయి.. నుశి అయిపోతుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
అంటే.. ఒకరకంగా.. వైసీపీపై బీజేపీ దూకుడు మామూలుగా లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొన్ని వారాలుగా.. బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నారు. దీంతో బీజేపీ దూకుడు పెరిగిందని.. అంతో ఇంతో గ్రాఫ్ కూడా పెరుగుతోందని అనుకుంటున్నారు. సోము వీర్రాజు కూడా.. ఇదే తరహాలో లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీ కీలక నాయకుడు సత్య కుమార్ ఏకంగా.. సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు.
మరి ఇలా బీజేపీ రాష్ట్ర నాయకులు.. గడపగడప కార్యక్రమంపై నిప్పులు చెరుగుతుంటే.. వెంకయ్యనాయుడు.. మాత్రం గడపగడపకు కార్యక్రమంపై పొగడ్తల వర్షం కురిపించారు. ``ఇది చాలా మంచి కార్యక్రమం. ప్రతి ఇంటికీ అధికారంలో ఉన్నవారు వెళ్తున్నారు. ఇది చాలా అరుదుగా జరుగుతున్న కార్యక్రమం. నేను ఎక్కడా ఇలాంటివి చూడలేదు. దీని వల్ల ప్రజలకు నేతలకు మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. దీనిని కొనసాగించండి`` అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు బీజేపీ నేతలు... ఇరుకున పడినట్టు అయింది. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.