Begin typing your search above and press return to search.
రోజాపై వెంకయ్య కాంప్లిమెంట్ అదిరిందే!
By: Tupaki Desk | 5 July 2017 4:19 AM GMTఆర్కే రోజా... పరిచయం అక్కర్లేని పేరే. గతంలో సినీ రంగంలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రోజా... ఆ తర్వాత రాజకీయాల్లోకి దూకేశారు. తొలుత టీడీపీలో కొంతకాలం పాటు కొనసాగిన ఆమె... ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ లోకి చేరిపోయారు. ఆ తర్వాత వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి వెంటే నడిచిన రోజా... జగన్ స్థాపించిన వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా... ఇప్పుడు వైసీపీలో మంచి వాగ్దాటి ఉన్న నేతగా మనందరికీ తెలిసిందే. అధికార పక్ష నేతలకు ఏమాత్రం భయపడని రోజా... విమర్శలు సంధించడంలో దిట్టగానే ఎదిగారు. అసలు రోజా దెబ్బకు టీడీపీ సీనియర్ నేత, నగరిలో మొన్న రోజా చేతిలో ఓటమిపాలైన గాలి ముద్దుకృష్ణమనాయుడు వణికిపోతారన్న వాదన కూడా లేకపోలేదు.
అసలు రోజాను ఢీకొట్టేందుకు టీడీపీలోని కాకలు తీరిన నేతలు కూడా ముందూవెనుకా చూసుకునే పరిస్థితి. ఇందుకేనేమో... రోజాపైకి దళిత వర్గానికి చెందిన తమ ఎమ్మెల్యే వంగలపూడి అనితను టీడీపీ ప్రయోగిస్తోందన్న వాదన కూడా లేకపోలేదు. తనపైనే కాకుండా... తన పార్టీపైకి దూసుకువచ్చే విమర్శలను తిప్పికొట్టడంలో రోజాకు ఉన్నంత స్పీడు మరే నేతకు లేదనే చెప్పాలి. ఓ సినీ నటిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన రోజా... రాజకీయాల్లో అతి తక్కువ కాలంలోనే పరిణతి చెందిన నేతగా, వాగ్దాటి ఉన్న నేతగా ఎదడగం నిజంగానే ఆశ్చర్యం వేయక మానదు. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నామంటే... రోజా వ్యాఖ్యలు స్థాయికి తగ్గట్టుగా ఉండవని అధికార టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది. అయితే ఆ ఆరోపణల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదని చెప్పేందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఓ ఘటన నిన్న ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ సమక్షంలో జరిగింది.
ఆ అరుదైన ఘటన వివరాల్లోకి వస్తే... నిన్న తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన కోవింద్ ను కలిసేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు - ఎంపీలతో కలిసి హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ కు వెళ్లారు. వయసులో తనకంటే పెద్దవారైన కోవింద్ కు పాదాభివందనం చేసిన జగన్... ఆ తర్వాత తన పార్టీ ఎమ్మెల్యేలను - ఎంపీలను ఒక్కొక్కరిగా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. ముందుగా నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజానే ఆయన కోవింద్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కోవింద్ పక్కనే నిలబడ్డ బీజేపీ సీనియర్ నేత - కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు... రోజాకు సంబంధించి ఆసక్తికర కామెంట్లను చేశారు.
రోజాను కోవింద్ కు చూపుతూ ‘షి ఈజ్ డేరింగ్ అండ్ డాషింగ్ - యాక్టివ్ ఉమన్ ఇన్ పాలిటిక్స్’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. అంటే తమ మిత్రపక్షం టీడీపీపై రోజా ఎంతమేర విరుచుకుపడుతున్నా... వెంకయ్య మాత్రం ఆమెలోని సత్తా కలిగిన రాజకీయ నేతనే చూశారన్న మాట. అంతే కాకుండా మహిళా రాజకీయవేత్తల్లో యమా యాక్టివ్ గా ఉన్న నేతగానూ ఆయన రోజును అభివర్ణించిన తీరు అక్కడి వారిని అమితంగా ఆకట్టుకుందనే చెప్పాలి. రోజాపై వెంకయ్య కామెంట్లు వింటే... టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారోనన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.