Begin typing your search above and press return to search.
రోహిత్ ఇష్యూలో వెంకయ్య ఇరుక్కున్నారా?
By: Tupaki Desk | 21 Jan 2016 9:08 AM GMTదేశవ్యాప్తంగా సరికొత్త వివాదంగా మారి.. అధికారిక బీజేపీకి కొత్త తలనొప్పిగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో ఇద్దరు కేంద్రమంత్రుల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్లుగా తాజాగా మరోపేరు తెర మీదకు వచ్చింది. రోహిత్ ఆత్మహత్యకు కారణంగా కేందమంత్రులు బండారు దత్తాత్రేయ.. స్మృతి ఇరానీ పేర్లు రావటం.. వీరి వైఖరితోనే మనస్తాపానికి గురైన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరు కేంద్రమంత్రులతోపాటు.. వర్సిటీ వీసీకి కూడా బాధ్యత ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వీసీ వ్యవహారంలోనే మరో కేంద్రమంత్రి పేరు వినిపిస్తోంది. వర్సిటీ వీసీగా వ్యవహరిస్తున్న అప్పారావు నియామకం మొత్తం కేంద్రమంత్రి వెంకయ్య కారణంగానే జరిగిందన్నది తాజా ఆరోపణ. సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా పొదిలి అప్పారావును ఎంపిక చేయటంలో రాజకీయ నేతలకు బలమైన సంబంధాలు ఉన్నట్లుగా విమర్శలు మొదలయ్యాయి. వెంకయ్యనాయుడితో అప్పారావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఆ పరిచయంతోనే ఆయనకు వీసీగా బాధ్యతలు అప్పజెప్పినట్లుగా చెబుతున్నారు.
వెంకయ్యనాయుడితో తనకున్న సన్నిహిత సంబంధాల కారణంగా వీసీగా 35 మంది పోటీ పడినా అప్పారావుకే ఆ పదవి దక్కటానికి కారణం రాజకీయమే తప్ప మరొకటి కాదన్న మాట వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయన బ్యాక్ గ్రౌండ్ ను గుర్తు చేస్తున్నారు. ఏపీకి చెందిన అప్పారావు 2001-04 మధ్య కాలంలో వర్సిటీ హాస్టల్ కు చీఫ్ వార్డెన్ గా పని చేశారని.. బలమైన పొలిటికల్ లాబీయింగ్ తోనే ఆయనకు వీసీ పదవి దక్కినట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబు రికమండేషన్.. వెంకయ్య ఆశీస్సులు కలవటంతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆయనకు వర్సిటీ వీసీ బాధ్యతలు అప్పజెప్పినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తున్న బండారు దత్తాత్రేయ.. స్మృతి ఇరానీలతో పాటు వెంకయ్యపేరు కూడా తెరపైకి రానుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.