Begin typing your search above and press return to search.
వెంకయ్య.. ప్రతి రోజూ ఆ పనిచేస్తారు
By: Tupaki Desk | 23 Dec 2015 5:30 AM GMTసందర్భం ఎలాంటిదైనా అంత్యప్రాసలతో మాట్లాడటం.. భాష ఏదైనా తనకంటూ ఓ స్టైల్ ఏర్పరచుకుని మాట్లాడే సత్తా ఉన్న కొద్దిమంది రాజకీయ నేతల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఒకరు. ఆయన మాటలకు మీనింగ్ చాలా సందర్భాల్లో చిరాకు పుట్టించేలా ఉన్నా.. ఆయన మాట్లాడుతుంటే మాత్రం వినసొంపుగా ఉంటుందని పేరు. చాలాసందర్భాల్లో ఆయన ప్రయోగించే పదాలు.. వాటి ప్లేస్ మెంట్ కాస్త భిన్నంగా ఉండటమే దీనికి కారణంగా చెప్పొచ్చు.
ఢిల్లీలో తెలుగువారికి పెద్ద దిక్కులా ఉండే వెంకయ్యకు సంబంధించి ఆసక్తికరమైన విషయాల్ని చెబుతుంటారు. కేంద్రమంత్రిగా.. పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఆయన ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ.. అంత బిజీలోనూ ప్రతి ఉదయం ఆయన ఒక పనిని క్రమం తప్పకుండా చేస్తారని చెబుతారు. అదేంటంటే బ్యాడ్మింటన్.
ఉదయాన్నే ఆయన చేతిలో రాకెట్ పట్టుకొని బ్యాడ్మింటన్ ఆడుతుంటారు. ఎంత బిజీగా ఉన్నా సరే.. ఆయన ఆట ఆడాల్సిందేనని చెబుతారు. ఢిల్లీలోనే కాదు.. హైదరాబాద్ లో ఉన్నా.. ఇతర ప్రదేశాల్లో ఉన్నా ఆయన చేతిలో బ్యాట్ కాసేపు ఉండాల్సిందేనట. ప్రయాణాల్లో ఉంటే తప్ప రాకెట్ పట్టని రోజంటూ ఉండదని చెబుతుంటారు. కీలక స్థానంలో ఉండి.. ప్రతి నిమిషం అమూల్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. ఆటకు ఆయనిచ్చే ప్రాధాన్యత.. ఉదయాన్నే కాసేపు వ్యాయామం చేయాలన్న ఆలోచన చాలామందికి స్ఫూర్తినిస్తుందని చెబుతారు. ఊపిరి సలపనంత బిజీగా ఉండి కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆడటం నిజంగా గొప్పే కదూ.