Begin typing your search above and press return to search.

వెంకయ్యకు ఒళ్లు మండేలా చేసిన ఎయిరిండియా?

By:  Tupaki Desk   |   28 Jun 2016 4:34 PM GMT
వెంకయ్యకు ఒళ్లు మండేలా చేసిన ఎయిరిండియా?
X
సగటు జీవికి తరచూ ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితి తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి ఎదురైంది. ఒక ముఖ్యమైన పని కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఆయనకు ఎయిరిండియా తీరు కారణంగా ఆయన అప్ సెట్ అయ్యారు. నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ వ్యవహారంపై వెంకయ్య తన ఆగ్రహాన్ని దాచుకోలేకపోయారు. తన అసహనాన్ని ట్విట్టర్ పిట్టతో చెప్పి.. లోకానికి తెలిసేలా చేశారు.

ఒక ముఖ్యమైన పని కోసం హైదరాబాద్ బయలుదేరాల్సిన వెంకయ్య ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకున్నారు. తాను ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానం కోసం దాదాపు గంటసేపు వెయిట్ చేశారు. ఆ తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్లుగా.. తియ్యటి గొంతుతో అనౌన్సర్.. క్షమాఫణలు చెబుతూ.. ఎయిరిండియా పైలెట్ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారని.. అందుకే విమానం ఆలస్యం అవుతుందని ప్రకటించారు. దీంతో.. అస్సటికే అసహనంతో ఉన్న ఆయన ఇంటికి వెళ్లిపోయారు.

మధ్యహ్నాం 2.30గంటలకుఈ విమానం హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లింది. ఈ ఎపిసోడ్ మీద తీవ్ర అసహనానికి గురైన వెంకయ్య తీవ్రస్థాయిలో మండిపడుతూ.. ఇలాంటి పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావటం లేదని.. పోటీ ప్రపంచంలో ఇలా జరగటం ఏమిటంటూ ప్రశ్నించారు. విమానం ఆలస్యం కావటం వల్ల తానో ముఖ్యమైన మీటింగ్కు హాజరు కాలేదన్న బాధను వ్యక్తం చేశారు. వెంకయ్య ఆగ్రహాన్ని గుర్తించిన కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వెంటనే.. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. వెంకయ్యకు అసౌకర్యం జరిగింది కాబట్టి..ఇంత జరిగింది. మరి.. సాధారణ ప్రయాణికుడి పరిస్థితేంది..?