Begin typing your search above and press return to search.
వెంకయ్యను ఆయనింట్లో ఏమంటారంటే..!
By: Tupaki Desk | 4 July 2015 4:41 AM GMTదేశంలో అత్యంత కీలక స్థానంలో ఉన్న వ్యక్తి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? భార్య నోట వెంట ఎలాంటి మాటలు వస్తుంటాయి? పిల్లలు ఎలా మాట్లాడుతుంటారు..? ఇక.. మనవళ్ల మాటేమిటి? లాంటి ఆసక్తికరమైన విషయాల్ని చెప్పే ప్రయత్నం చేశారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.
మోడీ సర్కారులో అత్యంత కీలకబాధ్యతలు చేపట్టటంతో పాటు.. ప్రధాని మోడీ లాంటి వ్యక్తి సైతం.. స్వయంగా వెంకయ్యనాయుడు కారణంగా ఢిల్లీలో తాను సులభంగా నెగ్గుకు వస్తున్న విషయాన్ని పేర్కొనటం గమనార్హం.
అలాంటి అతి ముఖ్యమైన వ్యక్తి.. ఇంట్లో ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందన్న విషయాన్ని తాజాగా ఆయనే వెల్లడించారు. తనకు దేశాలు తిరగటం తప్పించి మరో పని లేదన్న ఆయన.. తన కూతుళ్లు తనను ఉద్దేశించి.. అన్ని చోట్లకు వెళ్లినట్లే అప్పుడప్పుడు మా నాన్న ఇంటికి కూడా వస్తుంటారని వ్యాఖ్యానిస్తారని.. ఇక తన భార్య అయితే.. రోజూ టీవీలో చూసుకుంటానని చెబుతారన్నారు. ఇక... తన మనమళ్లు.. మనమరాళ్లు అయితే.. టీవీ తాతయ్య అంటూ పిలుస్తారని చెప్పుకొచ్చారు. దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న వెంకయ్యకు సైతం.. ఇంట్లో సటైర్లు తప్పవన్నమాట.