Begin typing your search above and press return to search.
అసద్ కు ఖాసిం రజ్వీకి లింకుందా?
By: Tupaki Desk | 18 March 2016 5:00 AM GMTకేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి గుస్సా పీక్ స్టేజ్ కి వెళ్లింది. మజ్లిస్ అధినేత అసద్ పేరు వింటే చాలు అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. తన గొంతు మీద కత్తి ఉంచినా.. భారత్ మాతాకీ జై అననంటే అననన్న అసద్ మీద.. మొన్నా మధ్య లోక్ సభలో చెలరేగిపోయిన వెంకయ్య.. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరై తీవ్రంగా మండిపడ్డారు.
అసద్ మీద పలు వర్గాల వారు తీవ్రస్థాయిలో మండిపడ్డా.. తాజాగా వెంకయ్య ప్రదర్శించిన ఆగ్రహం ముందు దిగదుడుపేనని చెప్పక తప్పదు. భారత్ మాతాకీ జై అంటే అమ్మకు జై అన్నట్లేనని.. తల్లికి జై అనని వాళ్లు ఎవరుంటారని.. ఈ దేశంలో ఉంటూ అలా అనమని చెప్పే హక్కు ఎవరికి లేదని తేల్చిన వెంకయ్య.. భారత్ ను మాతృభూమి అంటారే కానీ పితృభూమి అనరన్న విషయాన్ని గుర్తు చేశారు.
మాతృభూమి అని బీజేపీ.. ఆర్ ఎస్ ఎస్ లు పేరు పెట్టలేదన్న వెంకయ్య.. నాడు ఖాసింరజ్వీ తెలంగాణలో ఎన్నో ఆరాచకాలు చేశాడని.. భారతమాతకు జై అనలేక పాకిస్థాన్ వెళ్లిపోయిన విషయాన్ని గుర్తు చేయటం గమనార్హం. ఆ వారసత్వంలో వచ్చిన ఛాందసవాద సంస్థలు మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయటాన్ని ఆయన తీవ్రంగా దునుమాడారు. అలాంటి రాజకీయ పక్షాలతో పొత్తు పెట్టుకున్న వారు ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ చురకలేశారు. మజ్లిస్ తో రాజకీయపొత్తు చేసుకునేవాళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ వెంకయ్య వేసిన చురకలు ఎవరిని ఉద్దేశించినవి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. మరి.. వెంకయ్య చురకల మీద తెలంగాణ అధికారపక్షం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.