Begin typing your search above and press return to search.
బీజేపీ ఆ అంశాన్ని ఇలా ఉపయోగించుకొంటే ఎలా?
By: Tupaki Desk | 20 March 2015 4:46 AM GMTప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుపట్టాడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఇదేమీ కొత్త గానీ.. వెంకయ్య మరోసారి కాంగ్రెస్ పై ధ్వజమెత్తాడు. ఏపికి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని వెంకయ్య అంటున్నాడు.
అయితే తమ పార్టీ మాత్రం ఏపీ ప్రయోజనాల విషయంలో కట్టుబడి ఉందని ఈయన స్పష్టం చేశాడు. ఈ విషయంలో తమకు చిత్తశుద్ధి ఉందని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాడని వెంకయ్య స్పష్టం చేశాడు.
మరి ఈ మంత్రిగారు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడటం వరకూ బాగానే ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ ది ద్వంద్వ వైఖరి అని అనడం కూడా బాగానే ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ వాళ్లు విమర్శించుకోవడం.. బీజేపీపై కాంగ్రెస్ వాళ్లు విమర్శలు చేయడం వల్ల ఏపీ ప్రజలకు దక్కేదేమీ లేదు!
ఏపీ ప్రయోజనాల అంశాన్ని ఈ రెండు పార్టీలూ తమ తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొంటున్నాయి. తమ ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడానికి ఉపయోగించుకొంటున్నాయి. దీని వల్ల వాళ్లకు పొద్దు పోతుందేమో కానీ... ఏపీకి మాత్రం దక్కేదేమీ లేదు.
వెంకయ్య విమర్శలు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సరిగా లేదు. అందుకే ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను తుడిచిపెట్టారు. అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికల్లో గర్వభంగం కలిగించారు. అసెంబ్లీలో కనీసం స్థానం కూడా లేకుండా చేశారు.
మరి ఇప్పుడు ఈ విషయంలో కాంగ్రెస్‌ను కొత్తగా విమర్శించడానికేమీ లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలి. విభజనతో అన్యాయానికి గురైన ఏపీకి న్యాయం చేయాలి. ప్రత్యేక హోదా వంటి అంశం గురించి ఉత్తుత్తి కబుర్లు కాకుండా చేతలను చూపాలి. అంతే కానీ.. ఈ అంశాన్ని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తడానికి ఉపయోగించుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేముంది?!