Begin typing your search above and press return to search.
ప్రియమైన మిత్రులపై వెంకయ్య సెటైర్లు
By: Tupaki Desk | 17 April 2016 6:06 AM GMTకమ్యూనిస్టులు - కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయడంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మరోమావరు వారిని కెలికారు. వెంకయ్య అంటే విమర్శలకు, చరిత్ర తాలుకు సందర్భాన్ని పూసగుచ్చినట్లు చెప్పడానికి పెట్టింది పేరు అనే సంగతి తెలిసిందే. అయితే ఆయన సందర్భం కానప్పటికీ ఈ రెండు పార్టీల నాయకులను ముగ్గులోకి లాగి విమర్శలు చేశారు. నెల్లూరులోని సర్వోదయ కళాశాల మైదానంలో జరిగిన బీజేపీ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని కాంగ్రెస్ - కమ్యూనిస్టులు కలసి ఇప్పటివరకూ నాశనం చేశారని మండిపడ్డారు.
1969లో కాంగ్రెస్ పార్టీ దేశంలో చీలికలు పీలికలైందనీ వెంకయ్య నాయుడు అన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ - కమ్యూనిస్టులు ఒక్కటయ్యారన్నారు. దేశ పాలనను కాంగ్రెస్ కు ఇచ్చి దేశంలోని విశ్వ విద్యాలయాలు - విద్యా వ్యవస్థలో కమ్యూనిస్టులు స్థిరపడిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అక్కడ నుంచే అనేక రచనలు పుస్తకాల రూపంలో బయట వచ్చాయని, దేశంలోని ప్రజలపై వ్యతిరేక భావన చూపించారని అన్నారు. భగత్ సింగ్ ను కూడా ఒక తీవ్రవాదిగా చిత్రీకరించిన ఘనత ఈ రెండు పార్టీలకు దక్కిందని వ్యాఖ్యానించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని యూనివర్సిటీల్లో దేశం కోసం త్యాగం చేసిన అనేక మంది గురించి పుస్తకాల రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీన్ని తట్టుకోలేక దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు మోడీపై దుష్ప ప్రచారం చేస్తున్నాని వెంకయ్య అసహనం వ్యక్తం చేశారు. దేశంలోని విశ్వవిద్యాలయాలతోపాటు విద్యా వ్యవస్థలో కమ్యూనిస్టులు పాగా వేసి ప్రజలను దేశ వ్యతిరేకు లుగా తయారు చేస్తున్నారని, దీన్ని ప్రశ్నించినందుకే మోడీపై మూకుమ్మడిగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
దేశంలో స్వేచ్ఛలేదని అనేక మంది విమర్శిస్తున్నారని అయితే భారతదేశంలో స్వేచ్ఛ లేకుంటే ప్రపంచంలో ఎక్కడా లేదని వెంకయ్యనాయుడు అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంత మయ్యాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఏడాదిలోనే రూ.25.25 కోట్ల విలువగల బ్యాంకు ఖాతాలు ప్రారంభించారన్నారు. మూడున్నర కోట్ల మందికి బ్యాంకు ద్వారా రూ.1.16 వేల కోట్లు రుణంగా ఇచ్చామన్నారు. నదుల అనుసంధానానికి నిధులిస్తున్నామని వెంకయ్య తెలిపారు. సాగరమాల పేరుతో దేశంలోని అన్ని పోర్టులను కలిపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకూ బకింగ్ హాం కెనాల్ ను పునర్నిర్మించే పని ప్రారంభిం చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిందే తడవుగా నిధులు విడుదల చేస్తున్నామని ప్రస్తావించారు. ఏపీలో జాతీయ రహదారుల అభివృద్ధికి ఇప్పటివరకూ రూ.65 వేల కోట్లు విడుదల చేశామన్నారు. ప్రతి గ్రామానికీ 2019 నాటికి రోడ్లు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కరెంటు ఉత్పత్తులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. సందర్బానుసారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని పొగిడేసే వెంకయ్యనాయుడు ఇపుడు కాంగ్రెస్ - కమ్యూనిస్టు నాయకులను వాయించేయడం తేనెతుట్టెను కదిపినట్లే ఉంది.