Begin typing your search above and press return to search.

వెంక‌య్య చెప్పిన ఐదు సామెత‌లివే....

By:  Tupaki Desk   |   18 Nov 2016 6:10 AM GMT
వెంక‌య్య చెప్పిన ఐదు సామెత‌లివే....
X
మాట‌ల మాంత్రికుడు అయిన కేంద్ర గ్రామీణాభివృద్ధి - స‌మాచార శాఖా మంత్రి వెంక‌య్య‌నాయుడు పార్ల‌మెంటు వేదిక‌గా మ‌రోమారు త‌న వాగ్దాటిని ప్ర‌ద‌ర్శించారు. పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో విప‌క్షాలు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు చేస్తున్న నేప‌థ్యంలో ప్ర‌సంగించిన వెంక‌య్య ఈ మేర‌కు సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు. తమకు ప్రతికూలంగా మారుతుందని భావించినందునే విపక్షాలు నోట్ల ర‌ద్దు ఉప‌సంహ‌ర‌ణ నిర్ణయాన్ని ముందుకు తెస్తున్నాయని వెంకయ్యనాయుడు ఆరోపించారు. కాంగ్రెస్ - ఇతర విపక్షాలు చర్చ నుంచి తప్పించుకోవాలని చూడటం నిర్హేతుకం అని అన్నారు.

"ప్ర‌తిప‌క్షాల నేత‌లు విభిన్న స్వరాలతో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకమా? కాదా? అనే అంశంపై వారు స్పష్టంగా ముందుకు రావడం లేదు. వారంతా గందరగోళంలో ఉన్నారు. అలాగే కొనసాగాలని భావిస్తున్నారు" అని వెంకయ్య చెప్పారు. "ఎవరి వద్ద నల్లధనం నిల్వలున్నాయో - ఎవరు ప్రభుత్వంతో ఉన్నారో - ఎవరు వ్యతిరేకమో యావత్ దేశం గమనిస్తున్నది. ప్రధాని మోడీ విప్లవాత్మక చర్య తీసుకున్నారు. ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యల పరిష్కారానికి సర్కార్ సిద్ధంగా ఉంది" అని అన్నారు. పరిస్థితిలో మెరుగుదలకు కొత్త ఆలోచనలు స్వీకరించేందుకు సిద్ధమని చెప్తూ ప్రభుత్వ చర్యలకు ఉద్దేశాలు ఆపాదిస్తే చివరిగా ప్రజలే సరైన తీర్పు చెప్తారని వెంక‌య్య అన్నారు.

ఈ సంద‌ర్భంగా వెంక‌య్య నాయుడు చెప్పిన సామెత‌లివే...

1.తాత్కాలిక ఇబ్బంది ఉంటుందేమో కానీ శాశ్వ‌త లాభం మాత్రం క‌లుగుతుంద‌నే విష‌యాన్ని మ‌న‌మంతా గుర్తుంచుకోవాలి. పోస్టాపీసులు - బ్యాంకుల వ‌ద్ద క్యూలైన్ల‌ను చూసి కంగారు ప‌డ‌క్క‌ర్లేదు.

2. మీ డ‌బ్బు నిజ‌మైన‌ది - న్యాయ‌బ‌ద్ద‌మైన‌ది అయితే....న‌ష్ట‌పోతామ‌నే భ‌యం వ‌దిలేయండి. కాస్త స‌మ‌యం తీసుకొన‌యినా మార్చుకోవ‌డం ద్వారా ప్ర‌శాంతంగా ఉండ‌వ‌చ్చు.

3.ప్ర‌తిసారి మేం ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ద్వారానే ఇక్క‌డికి వ‌చ్చాం. సెల‌క్ష‌న్ - క‌లెక్ష‌న్‌ - ఎలక్ష‌న్ అనేవి భార‌త‌దేశంలో సాధారణం అయిపోయాయి.

4. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చెప్తుండే రిఫార్మ్‌ - ఫ‌ర్ ఫార్మ్‌ - ట్రాన్స్ ఫార్మ్ నినాదం దేశ అభివృద్ధిని ఉద్దేశించిందే.

5.పెద్ద నోట్ల ర‌ద్దు ద్వారా దేశ అభివృద్ధికి తాను ఎంత చిత్త‌శుద్ధితో క‌ట్టుబ‌డి ఉన్నానో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చాటుకున్నారు. మ‌న‌మంతా దానికి మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా అదే చిత్త‌శుద్ధిని చూపిద్దాం. దేశ అభివృద్ధిలో భాగ‌స్వామ్యులం అవుదాం

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/