Begin typing your search above and press return to search.

వెంక‌య్యనాయుడు....ఈ సారి సేమ్ టు సేమ్

By:  Tupaki Desk   |   20 Aug 2015 7:09 AM GMT
వెంక‌య్యనాయుడు....ఈ సారి సేమ్ టు సేమ్
X
ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు. తెలుగు వ్య‌క్తిగా, బీజేపీ అగ్ర‌నేత‌ల్లో కీల‌క స్థానంలో ఉన్న వెంక‌య్య‌నాయుడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ టీంలో కీల‌క స‌భ్యుడు. కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా పై చేతులు ఎత్తేసిన నేప‌థ్యంలో వెంక‌య్య‌నాయుడు ఎక్క‌డా బ‌హిరంగంగా త‌న మ‌నోభావాల‌ను పంచుకోలేదు. తాజాగా ఆయ‌న త‌న భావాల‌ను స్ప‌ష్టం చేశారు. అయితే అది ఆంధ్రుల గుండెలు మండేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెంలో నిట్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి అతిథిగా హాజ‌రైన వెంకయ్య‌నాయుడు ప్ర‌సంగం ప్రారంభిస్తుండ‌గా ప‌లువురు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వెంక‌య్య చిర్రుబుర్రులాడారు. తెలంగాణ ఏర్పాటు స‌మ‌యంలో రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ జ‌రుగుతున్న‌పుడు ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం పోరాడింది తానేన‌ని అన్నారు. అపుడు మాట్లాడ‌ని ఎవ‌రు కూడా ఈనాడు ప్ర‌త్యేక హోదా గురించి నిన‌దిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ఏపీ ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకు తానెప్పుడు ప్ర‌య‌త్నం చేస్తుంటాన‌ని... అయితే అది గుర్తించుకోక‌పోతే తానేం చేస్తాన‌ని ప్ర‌శ్నించారు.

అయితే త‌ను ఎవ‌రి మెప్పు కోసం ప్ర‌య‌త్నం చేయ‌న‌ని, అస‌లు ఆ అవ‌స‌రం త‌న‌కు లేద‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడూ తాను ఏపీ నుంచి ఎంపిక కాలేద‌ని, భ‌విష్య‌త్‌ లోనూ ఎంపిక కానని చెప్పారు. త‌న‌ను బెదిరించేందుకు, అదిలించేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం స‌రికాద‌న్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో త‌మ‌కు స్ప‌ష్ట‌త ఉంద‌ని అన్నారు.