Begin typing your search above and press return to search.
వెంకయ్య ఫ్యూచర్ ఇదేనంట
By: Tupaki Desk | 18 Feb 2016 6:49 AM GMTకేంద్రమంత్రి వెంకయ్యనాయుడి భవిష్యత్తు ఏమిటి? అన్న ప్రశ్న వేస్తే విచిత్రంగా చూసే వాళ్లే ఎక్కువమంది. మోడీ సర్కారులో కీలకపాత్ర పోషిస్తూ.. ప్రధానికి అనుక్షణం అండగా నిలుస్తూ.. విపక్షాల్ని సమన్వయం చేసుకోవటం.. అవసరానికి తగ్గట్లుగా వ్యవహరించటం వెంకయ్యకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి వెంకయ్య భవిష్యత్తు దివ్యంగా ఉంటుందని చెప్పొచ్చు. కానీ.. ఇక్కడే పెద్ద తిరకాసు ఉంది.
మిగిలిన బీజేపీ ముఖ్యనేతల మాదిరి వెంకయ్య సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి కాలేదు. ఆయన కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక.. బీజేపీలో ఉన్న అంతర్గత నిబంధన ప్రకారం.. ఏ స్థాయి నేతకు అయినా మూడుసార్లు మాత్రమే నామినేటెడ్ పదవి కట్టబెట్టాలి. వెంకయ్య ఆ లిమిట్ ను దాటేశారు. ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వటం అంటే.. పార్టీ పెట్టుకున్న లెక్కల్ని పక్కన పెట్టినట్లే. అయితే.. అన్నింటికి మాదిరే ఈ రూల్ కి చిన్న మినహాయింపు ఉంది. ప్రత్యేక సందర్భాల్లో.. చాలా అరుదుగా మాత్రమే నాలుగోసారి రాజ్యసభకు ఎంపిక చేస్తారు.
ఈ జూన్ లో వెంకయ్య పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన్ను తిరిగి ఎన్నిక చేయకుండా.. ఉప రాష్ట్రపతిని చేస్తారన్న వాదన జోరుగా వినిపిస్తుంటే.. ఆయన మాత్రం అలాంటిదేమీ లేదంటూ కొట్టి పారేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తతం ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తారన్న అంశంపై.. వెంకయ్యనాయుడి సన్నిహితుల మాటల ప్రకారం.. మధ్యప్రదేశ్ నుంచి వెంకయ్యను రాజ్యసభకు బీజేపీ తరఫున ఎంపిక చేయటం ఖాయంగా చెబుతున్నారు. ఎన్డీయే సర్కారులో కీలకభూమిక పోషించే వెంకయ్యను వదులుకోవటానికి మోడీ సిద్ధంగా లేరని తెలుస్తోంది.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వెంకయ్య భుజం మీద గన్ను పెట్టి అద్వానీ బ్యాచ్ కి చెందిన నేతకు రాజ్యసభ సీటుకు మొండి చేయి చూపిస్తారన్న మాట వినిపిస్తోంది. అందరికి ఆమోదయోగ్యుడైన వెంకయ్యను అద్వానీ శిష్యుడు ప్లేస్ లో రీప్లేస్ చేస్తే కురువృద్ధుడు కూడా ఏమీ చేయలేరని చెబుతున్నారు. మొత్తానికి వెంకయ్య మరో అవకాశం ఇస్తూనే అద్వానీ వర్గాన్నిమోడీ బ్యాచ్ భలే దెబ్బ కొడుతుంది కదూ..?