Begin typing your search above and press return to search.
వెంకయ్యకు గొప్ప రిలాక్స్
By: Tupaki Desk | 23 Feb 2016 6:52 AM GMTరోహిత్ వేముల.....హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్. గత నెల 17న ఆత్మహత్య చేసుకున్న ఈ విద్యార్థి ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ యూనివర్శిటీ పాలనలో వేలుపెట్టారని, ఆయనే వీసీపై ఒత్తిడి తెచ్చి విద్యార్థుల సస్పెన్షన్‌కు కారణమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ దత్తన్నకు వంత పాడరని దుమారం రేగింది. అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అప్పారావు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు దగ్గరి మనిషి కావడం వల్లే రోహిత్ విషయంలో న్యాయం జరగడం లేదని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులు పలువురు ఆరోపించారు. అయితే ఈ ఎపిసోడ్ లో వెంకయ్యనాయుడు ఉపశమనం పొందే వార్త తెరమీదకు వచ్చింది.
రోహిత్ వేముల ఆత్మహత్యపై కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ అశోక్ కుమార్ రూపన్ వాల్ ఏకసభ్య కమిషన్ తన ప్రాథమిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది. నివేదికలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ - స్మృతి ఇరానీలకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రోహిత్ ఆత్మహత్యతో అప్పటి వీసీ ప్రొఫెసర్ అప్పారావు సెలవుపై వెళ్లగా..ఆయన స్థానంలో ప్రొఫెసర్ శ్రీవాస్తవ ఇన్ ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనా సెలవు పెట్టారు. దీంతో ప్రొఫెసర్ పెరియసామి ఇన్ ఛార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలాఉండగా రోహిత్ ఆత్మహత్యపై ప్రొఫెసర్ అప్పారావు వీసీగా ఉన్నపుడే అంతర్గత కమిటీని నియమించారు. ఆ కమిటీ ప్రాథమిక వివరాలను సేకరించి నివేదిక ఇచ్చింది. అయితే కేంద్ర మంత్రులపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. జస్టిస్ అశోక్ కుమార్ కమిషన్ కు నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం మూడు నెలల గడువు ఇచ్చింది. సమగ్ర నివేదికకు ముందే ప్రాథమిక నివేదికను ఏకసభ్య కమిషన్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ నివేదికలో ఇరువురు కేంద్ర మంత్రులకు క్లీన్ చిట్ ఇచ్చిందని, అయితే వీసీ, ఇతర యూనివర్శిటీ పాలకుల తీరును మాత్రం తప్పుపట్టినట్టు తెలిసింది. సరైన సమయంలో పాలకులు స్పందించి ఉంటే ఆత్మహత్య జరిగేది కాదనే భావన ఏక సభ్య కమిషన్ వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఎలాంటి చర్యలను సిఫార్స్ చేయలేదు.
రోహిత్ ఆత్మహత్యకు పాల్పడటం ఆయన రాసిన లేఖలో కొన్ని ప్రత్యేక అంశాలు ప్రస్తావన ఉండటంతో రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఈవిషయంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేరు తెరమీదకు రాగా...విద్యార్ధుల నుండి వచ్చిన ఫిర్యాదులను తాము కేంద్ర మానవ వనరుల మంత్రికి పంపించామని, అంతేతప్ప వర్శిటీ పాలనలో తానెన్నడూ జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్య ఎపిసోడ్ లో రాహుల్ గాంధీ మొదలుకొని అరవింద్ కేజ్రీవాల్ వరకు పలువురు జాతీయ నేతలు హెచ్ సీయూను సందర్శించిన సంగతి తెలిసిందే.