Begin typing your search above and press return to search.
వెంకయ్య లీక్ తో మోత్కుపల్లి ఫుల్ హ్యాపీ
By: Tupaki Desk | 9 Aug 2017 10:36 AM GMTఅధికారికంగా ప్రకటించకుండా నిర్ణయాలు బయటకు రావటం చాలా అరుదు. అందులోకి అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి నోటి నుంచి రావటం మహా అరుదు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించి ఆశ్చర్యానికి గురి చేశారు ఉప రాష్ట్రపతిగా ఇటీవల ఎన్నికైన వెంకయ్యనాయుడు. మరో రెండు రోజుల్లో దేశంలోనే రెండో అత్యున్న పదవికి పదవీ ప్రమాణస్వీకారం చేయనున్న ఆయన అంతకు ముందే తాను హాజరుకావాల్సిన కార్యక్రమాలకు వరుసపెట్టి హాజరవుతున్నారు.
ఒకసారి కానీ ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చుంటే రాజ్యాంగపరమైన కట్టుబాట్లకు లోబడి ఉండాల్సి రావటంతో.. అందుకు ఆయన ప్రిపేర్ అవుతున్నారు. నిత్యం మీడియాతో సన్నిహితంగా ఉండే వెంకయ్య.. ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత ఇప్పటి మాదిరిగా మాట్లాడలేని పరిస్థితి. అందుకే.. ఆయన తన చివరి ప్రెస్ మీట్ ను కూడా పెట్టేసి.. రాజకీయాల్ని వదిలిపెట్టి వెళ్లటం తనకు చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. కీలక నిర్ణయాలు.. అధికారికంగా మాత్రమే వెల్లడి కావాల్సిన విషయాల్ని అస్సలు ప్రస్తావించని వెంకయ్య తన తీరుకు భిన్నంగా పెదవి విప్పేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయానికి సంబంధించి ఓపెన్ అయిపోయారు. ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న వెంకయ్యను అభినందించేందుకు పలువురు కలుస్తున్న వేళ.. టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వెంకయ్యను కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఉద్దేశించి కాబోయే గవర్నర్ అంటూ సంబోధించటం ఆసక్తికరంగా మారింది. అక్కడితో ఆగని వెంకయ్య.. త్వరలోనే శుభవార్తను వింటారన్నారు.
వెంకయ్య నోటే నేరుగా తనకు గవర్నర్ గిరి లభించనున్న విషయాన్ని విన్న మోత్కుపల్లి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. వెంకయ్యను అభినందించటానికి వచ్చిన పలువురు టీటీడీపీ నేతలు సైతం మోత్కుపల్లి విషయాన్ని తెలుసుకొని.. ఆయనకు అడ్వాన్స్ గా అభినందనలు తెలియజేస్తున్నారు.