Begin typing your search above and press return to search.
బాబును వెంకయ్య కూడా వదల్లేదు..
By: Tupaki Desk | 22 Feb 2019 9:57 AM GMTరాజకీయాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిని చేసి స్తబ్దుగా మార్చేశారు మోడీషాలు. అంతకుముందు వెంకయ్య మాట్లాడితే తుటాల్లా మాటలు పేలాయి. ఇప్పుడు ఏం మాట్లాడినా న్యూట్రల్ గా మాట్లాడాల్సి వస్తుండడంతో వెంకయ్య ప్రసంగాల్లో వాడివేడి లేకుండా పోయింది. టైమ్ వచ్చినప్పుడు మాత్రం వెంకయ్య పరిమితికి లోబడే సెటైర్లు వేస్తున్నారు.
తాజాగా నెల్లూరు రైల్వేస్టేషన్లో జరిగిన అభివృద్ధి పనుల కార్యక్రమానికి వెంకయ్య నాయుడు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కేంద్రంతో విభేదాలు పక్కనపెట్టాలని చంద్రబాబుకు కొన్ని ఇన్ డైరెక్ట్ గా సూచనలు చేశారు. గెలిచిన వారిని గౌరవించాలంటూ హితబోధ చేశారు. ‘కేంద్రం, రాష్ట్రం రాజకీయ అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి భుజం భుజం కలిపి పనిచేయాలి. ఏపీయే కాదు.. అన్ని రాష్ట్రాలకు ఇదే సూచన పనిచేస్తుంది. గెలిచిన వారిని గౌరవించి కలిసి పనిచేయండి.. రాజకీయ శతృత్వాలు లేకుండా కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యం’ అని బీజేపీకి సపోర్టుగా.. బాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు.
మోడీతో వైరం బాబుకు నష్టం అన్నట్టు పరోక్షంగా వెంకయ్య హెచ్చరించారు. దీన్ని బట్టి చంద్రబాబు అవసరార్థం మాత్రమే రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారని.. రాష్ట్రం కోసం సొంత ఎజెండాలు అమలు చేస్తున్నారని వెంకయ్య విమర్శించినట్టైంది. అవసరం కోసం కేంద్రానికి మద్దతు.. అవసరం తీరాక ప్లేటు ఫిరాయించడాన్ని వెంకయ్య తప్పుపట్టారు.
నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు బీజం చేశారు. ఇప్పుడు స్వయంగా ప్రారంభోత్సవాలకు వెంకయ్య హాజరయ్యారు. అయితే టీడీపీ ఈ కార్యక్రమాన్ని హైజాక్ చేసింది. ఇద్దరు కేంద్రమంత్రులు వచ్చినా రాష్ట్ర మంత్రులే పెత్తనం చెలాయించారు. తెలుగు తమ్ముళ్లు హల్ చల్ చేశారు. వీరి అత్యుత్సాహం చూసి వెంకయ్య కేంద్ర రాష్ట్ర సంబంధాలపై బాబుకు చురకలంటించారు. చంద్రబాబుకు పరోక్షంగా క్లాస్ పీకారు.