Begin typing your search above and press return to search.

తమిళనాడు గవర్నరుగా వెంకయ్యనాయుడు?

By:  Tupaki Desk   |   9 Feb 2016 10:58 AM GMT
తమిళనాడు గవర్నరుగా వెంకయ్యనాయుడు?
X
తమిళనాడు గవర్నరుగా ఉన్న రోశయ్య పదవీకాలం పూర్తవగానే ఆయన స్థానంలో కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన సీనియర్ బీజేపీ నేత వెంకయ్యనాయుడు బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. గతంలోనూ ఇలాంటి ఊహాగానాలు వచ్చినా తాజాగా ఢిల్లీలో మరోసారి ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ జూన్ నాటికి తన కేబినెట్ లో మార్పులు చేర్పులు చేస్తారని.... ఆ సందర్బంగా కేబినెట్ లో సీనియర్లయిన ముగ్గురు మంత్రులను గవర్నర్లుగా పంపిస్తారని తెలుస్తోంది. వెంకయ్యను తమిళనాడుకు - నజ్మాహెప్తుల్లాను హిమాచల్ ప్రదేశ్ కు - కల్ రాజ్ మిశ్రాను కేరళకు పంపిస్తారని తెలుస్తోంది.

తమిళనాడు గవర్నరుగా ఉన్న రోశయ్య పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. అంతకు కొద్ది ముందు వెంకయ్యనాయుడును ఆపదవిలో నియమించే అవకాశాలున్నాయి.మరోవైపు వెంకయ్య రాజ్యసభ సభ్యత్వం కూడా జూన్ తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను తమిళనాడుకు పంపించి... ఆయన స్థానంలో ఆ స్థాయి సమర్థుడిని పట్టణాభివృద్ది శాఖ మంత్రిని చేయాలని మోడీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ సిటీల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో అనుభవం ఉన్నవారినే వెంకయ్యస్థానంలో నియమించే అవకాశాలున్నాయి. వీరితో పాటు కేబినెట్లో మరికొన్ని మార్పులు కూడా ఉండబోతున్నాయి.