Begin typing your search above and press return to search.
వెంకయ్యతో బాబు : ఆ విషయమే చర్చించారట
By: Tupaki Desk | 23 Sep 2015 8:07 AM GMTరెండు రోజుల సింగపూర్ పర్యటనను ముగించుకొని తిరిగొచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో సమావేశయ్యారు. వెంకయ్య ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశౄనికి బాబు హాజరయ్యారు. స్వచ్ఛభారత్ అంశంపై ఏర్పాటైన నీతి ఆయోగ్ సబ్ కమిటీకి చంద్రబాబు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నందున..సబ్ కమిటీ తుది నివేదికను ఆయన సమర్పించనున్నారు.
చంద్రబాబుకు అల్పాహార విందు అనంతరం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛభారత్ సమావేశం దృష్ట్యా ఏపీ సీఎం చంద్రబాబు గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శుల అభిప్రాయం తీసుకున్నారని వెంకయ్య తెలిపారు. దీంతోపాటు సింగపూర్ పర్యటన వివరాలను చంద్రబాబు తనతో పంచుకున్నారని చెప్పారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా..మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందని అయినప్పటికీ 2019 వ సంవత్సరం నాటికి స్వచ్ఛభారత్ లక్ష్యాలను సాధిస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు. విజయవాడ మెట్రోకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీలుగా ఎంపికైన నగరాలను అభివృద్ధి చేస్తామని వెంకయ్య హామీ ఇచ్చారు. బాబుతో తన భేటీలో రాజకీయపరమైన చర్చలు జరగలేదన్నారు.