Begin typing your search above and press return to search.
వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపదవి ఇష్టం లేదా..?
By: Tupaki Desk | 13 Nov 2021 11:30 AM GMTభారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్. విద్యార్థి సంఘం నాయకుడిగా మొదలు పెట్టిన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి వరకు ఎదిగారు. ఎమ్మెల్యేగా, పార్టీకి అధ్యక్షడిగా, కేంద్రమంత్రిగా ఎన్నో సేవలు చేసిన ఆయన ఇప్పుడున్న ఉపరాష్ట్ర పదవి ఇష్టం లేదని ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. నిత్యం ప్రజలను కలుస్తూ, ప్రజల్లో తిరగాలని ఉందని అన్నారు.
అయితే ప్రధానమంత్రి మోదీ బలవంతంగా తనకు ఉప రాష్ట్ర పదవి కట్టబెట్టారని కొందరు బీజేపీ నాయకులు గుసగుసలాడుకుంటారు. తనకు ఇష్టం లేకుండా ఆ పదవిలో కొనసాగుతున్నారని, అయితే ఒకానొక సందర్భంగా వెంకయ్యనాయుడు రాజీనామా చేస్తానన్న మోదీ ఒప్పుకోలేదన్న చర్చ కొనసాగుతోంది. అసలు వెంకయ్యనాయుడుకు ఈ ఉపరాష్ట్ర పదవి ఎందుకు ఇష్టం లేదు..?
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్యనాయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. విద్యార్థి నుంచే ఆయన ప్రజా సంక్షేమం కోసం పరితపించేవారు. అణగారిన వర్గాల కోసం, రైతుల కోసం కృషి చేశాడు. 1978లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
1980లో శాసనసభ పక్ష నేతగా వ్యవహరించారు. 1988లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కేంద్ర మంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగి చివరికి ఉపరాష్ట్రపతిగా సేవలందిస్తున్నారు.
వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతిగా ఉండడం ఇష్టం లేదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఆయన ఈ పదవి కట్టబెట్టినా కొన్ని రోజుల తరువాత రాజీనామాకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. అయితే ప్రధాన మంత్రి మోదీ అందుకు ఒప్పుకోలేదని సమాచారం.
నెల్లూరు పర్యటనలో వెంకయ్యనాయడు మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలని ఉందని వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచి చేయడంలో ఉన్న ఆనంద ఉపరాష్ట్రపదవిలో లేనది అన్నారు. ప్రజలకు సరైన సేవలు అందించాలనంటే రాజ్యాంగ బద్ధమన పదవిలో ఉండాలన్నారు.
అయితే వెంకయ్యనాయుడుకు ఇష్టం లేకున్నా మోదీ బలవంతంగా ఉప రాష్ట్రపదవిని కట్టబెట్టారని అంటున్నారు. తాను కేంద్ర మంత్రి పదవిలో ఉంటానని, ఉపరాష్ట్ర పదవి వద్దని మోదీకి విన్నవించినా తన మాట పట్టించుకోలేదని అనుకుంటున్నారు. అయితే వెంకయ్య నాయడు నేరుగా ఈ విషయాన్ని చెప్పకపోయినా ఆయన మాటలను బట్టి చూస్తే ఆయన అఇష్టంగానే ఉపరాష్ట్రపదవిలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
కానీ ఇటీవల వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఉపరాష్ట్రపదవి ఇష్టం లేదని చెబుతూనే ప్రజలంతా తనను రాష్ట్రపతిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. దీంతో వెంకయ్యనాయుడి వ్యాఖ్యలతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు.
అదీగాక ఉపరాష్ట్రపతి ఇష్టం లేకపోతే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి సొంత నియోజకవర్గంలో సేవలు చేసుకోవచ్చుగా అని అంటున్నారు. అదీ కాకుండా తన స్వర్ణభారతి ట్రస్టు ద్వారా స్వచ్ఛందంగా సేవలు కొనసాగించొచ్చుగా.. అని అంటున్నారు. అయితే వెంకయ్య నాయడి మాటలు రెండు రకాలుగా ఉన్నాయని, ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి కాకుండా రాష్ట్రపతి సీటులో కూర్చోవాలని ఆసక్తి ఉందని అంటున్నారు. అంతేకాంకుడా కేంద్ర మంత్రి పదవిలో ఉన్న ప్రజాదరణ ఉపరాష్ట్రపతి పదవిలో ఉండనందునే ఆయన అఇష్టంగా కొనసాగుతున్నారని అంటున్నారు.