Begin typing your search above and press return to search.
వెంకయ్య డైలాగ్... సేమ్ టు సేమ్
By: Tupaki Desk | 30 Aug 2015 11:19 AM GMTఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం ర్యాలీలు, రాస్తారోకోలు, బంద్ లు సాగుతున్నాకేంద్ర పట్టణాభివృద్ది శాఖా మంత్రి, బీజేపీ అగ్రనేత ముప్పవరపు వెంకయ్యనాయుడు మాత్రం తన స్టాండ్ లో మార్పేమీ లేదని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గలేదని వెంకయ్యనాయుడు తెలిపారు. దేశవ్యాప్తంగా 9 రాష్ర్టాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయని చెప్పిన వెంకయ్యనాయుడు..సాధ్యాసాధ్యాల ఆధారంగా నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఏపీ విషయంలో కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
ఏపీకి స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీలపై కేంద్రం కట్టుబడి ఉందన్నారు. తాను ఇటీవలే నీతి అయోగ్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై..... 75 నిమిషాల పాటు ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాల గురించి చర్చించినట్లు వివరించారు. ఏపీకి సహాయం చేయడంపై ప్రధానమంత్రికి నీతి అయోగ్ నివేదకి ఇస్తుందని, దాని ఆధారంగా మోడీ ప్రకటన చేస్తారని తెలిపారు. అందుకే నీతి అయోగ్ కు ఏపీ అవసరాలు సమస్యలను వివరించనట్లు తెలిపారు.
మొత్తంగా కేంద్రంలో అధికార బీజేపీ, రాష్ర్టంలో పాలకులుగా ఉన్న టీడీపీ తప్ప ఏపీలోని అన్నిపార్టీలు ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్నాయి. అన్నిపార్టీలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. అయితే ఇంకా వెంకయ్య మాత్రం నిబంధనలు.....డిమాండ్ లు అంటూ ఎంతకాలం ఒకటే మాటను చెప్పుకుంటూ వస్తారో చూడాలి మరి.