Begin typing your search above and press return to search.
ఆ విషయంలో టెన్షన్ పడవద్దంటున్న వెంకయ్య
By: Tupaki Desk | 29 July 2017 9:27 AM GMTఎన్డీఏ పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి - మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బీజేపీ - టీడీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ఏపీ పరంగా, రెండు పార్టీల నాయకుల కోణంలో చూసిన పెద్ద లోటు ఎదురవుతుందనే ఆవేదనకు చెక్ పెట్టేలా తాజాగా వెంకయ్య ఒకింత భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. విజయవాడలో జరిగి ఆత్మీయ అభినందన సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ ప్రత్యేక హోదాను మించిన ఆదా ఆంధ్రప్రదేశ్ కు వస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదా లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదని అధైర్యపడాల్సిన అవసరం అంతకంటే లేదని.. కేంద్రం అండగా ఉంటుందని వెల్లడించారు.
తాను క్రియాశీల రాజకీయాల్లో లేనప్పటికీ ఏపీ ప్రయోజనాల కోసం తనకు చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని వెంకయ్యనాయుడు అన్నారు. తనను క్రియాశీల రాజకీయాల నుంచి కొందరు తప్పించారనడం తప్పుడు ప్రచారం అని వెంకయ్యనాయుడు తెలిపారు. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయ్యాక రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించానని ఆయన వివరించారు. ``చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగాను. ఎంతో కష్టపడి చదివా.. రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగా. జనసంఘ్ కార్యకర్తగా మా విధానాలను గోడలపై రాశా..రిక్షాలో తిరిగి మైక్ ద్వారా ప్రచారం చేశాను. పార్టీతో అనుబంధం వదులుకోవడం బాధ కలిగిస్తోంది. అతిసామాన్యుడిని ఆ స్థాయికి తెచ్చిన పార్టీకి ఇక నుంచి పనిచేయలేకపోవడం బాధ కలిగిస్తోంది. కేంద్రమంత్రి కంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా - కార్యాలయ బాధ్యతలు చూడటమే నాకు ఇష్టమని చెప్పాను`` అని అన్నారు.
ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవసరం చాలా ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. మోడీ దేశాభివృద్ధిపై ఎన్నో కొత్త ఆలోచనలున్నాయని ఆయన తెలిపారు. ``దేశమంతా కమల వికాసంలో అమిత్ షా పాత్ర కీలకం. నన్ను అణచివేసేందుకే ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారనడం అర్థరహితం. రాష్ట్రాన్ని 2019 వరకు తెదేపా, భాజపా పాలించాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. నా కుమారుడు - కుమార్తె అల్లుడు వ్యాపారంలో జోక్యం చేసుకోలేదు. విదేశీ నిధుల విషయమై 18 లక్షల ట్రస్టులకు కేంద్ర నోటీసులు ఇచ్చింది. ఇందులో 5,900 ట్రస్టులకు విదేశీ నిధులు విషయమై నోటీసులు ఇచ్చారు. స్వర్ణభారత్ ట్రస్టు ప్రభుత్వం నుంచి విదేశాల నుంచి ఎప్పుడూ నిధులు తీసుకోలేదు`` అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దీర్ఘకాలిక సుఖాల కోసం స్వల్పకాలిక కష్టాలు తప్పవని వెంకయ్యనాయుడు అన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యలు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించేవేనని ఆయన వివరించారు. భారత్ శక్తి ఏమిటో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచానికి తెలియజెప్పారని ప్రశంసించారు.