Begin typing your search above and press return to search.
మరోమారు అదేమాట చెప్పిన వెంకయ్య
By: Tupaki Desk | 9 Nov 2015 4:45 PM GMTకేంద్ర పట్టణాభివృద్ధి - పార్లమెంటరీ వ్యవహారాల శాఖా వెంకయ్యనాయుడు మరోమారు తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీరవిధేయుడని చాటుకున్నారు. భవిష్యత్ లో ఎదురవుతుందో లేదో స్పష్టంగా తెలియని సమస్య నుంచి మోడీని ముందే బయటపడేయడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలకు ముందే సూచనలు జారీచేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ సహా పార్టీ అగ్రనేతలు - ఎంపీలు పాల్గొన్నారు. బీహార్ ఫలితాలతో పాటు పార్లమెంటు శీతాకాల సమావేశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. బీజేపీ పరాభావంపై హాట్ హాట్ గానే చర్చ సాగినట్లు సమాచారం. ప్రధాని మోడీని ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులుగా చేయరాదనే భావన వ్యక్తమైంది.
సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తాయి కానీ జాతీయ స్థాయిలో ప్రజల అభిప్రాయాలను కాదని అన్నారు. బీహార్ ప్రజల తీర్పును బీజేపీ గౌరవిస్తోందని, బీహార్ ఫలితాలపై పార్టీ విశ్లేషిస్తుందని చెప్పారు. అయితే బీహార్ ప్రజల తీర్పును సరైన విధంగా అర్ధం చేసుకోవలసిన అవసరం ఉందని వెంకయ్య అన్నారు. అంతే కానీ పార్లమెంటు స్తంభింపచేయడానకి బీహార్ ఫలితాలను విపక్షాలు సాకుగా భావిస్తే సహించమని వెంకయ్యనాయుడు అన్నారు. అలా చేస్తే బీహార్ ప్రజల వివేకాన్ని - విజ్ణతను ప్రశ్నించడమే అవుతుందని వెంకయ్యనాయుడు సెలవిచ్చారు.
ఇదిలాఉండగా...పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 26 నుంచి డిసెంబర్ 23 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ సమావేశమైన పార్లమెంటరీ బోర్డు ఈ తేదీలను ఖరారు చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వం జీఎస్ టీ సహా పలు కీలక బిల్లలను సభ ముందు ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే ప్రతిపక్షాలకు పరోక్ష హుకుంను వెంకయ్యనాయుడు జారీచేసినట్లయింది.