Begin typing your search above and press return to search.
కేంద్రం ఇచ్చే ఆ వెయ్యి కోట్లు రాజధానికి కాదా?!
By: Tupaki Desk | 17 March 2015 4:29 AM GMTబడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీవ్రమైన అన్యాయం చేసిందన్న ఆందోళన వ్యక్తం అయిన తరుణంలో ఏపీకి వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సాయం అనే ప్రకటన వచ్చింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఈ డబ్బును కేటాయిస్తోందని పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు.
అయితే ఇప్పుడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్న తీరును చూస్తుంటే ఆ వెయ్యి కోట్ల రూపాయల నిధులు రాజధాని కోసం ఇచ్చినవి కాదేమో అనే సందేహం వస్తోంది!
ఆ డబ్బులు స్మార్ట్‌సిటీల రూపకల్పన కోసం కేటాయిచారని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి దేశ వ్యాప్తంగా స్మార్ట్‌సిటీలను తీర్చిదిద్దే ప్రాజెక్టును మొదలుపెడుతున్నట్టుగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన వెంకయ్య ప్రకటించాడు.
ఇదే సమయంలో ఆయన ఏపికి ఇచ్చిన వెయ్యి కోట్ల రూపాయల గురించి ఒక ప్రకటన చేయడం ఆసక్తికరంగా ఉంది. ఆ డబ్బును కేవలం తూళ్లూరు ప్రాంతంలో మాత్రమే ఖర్చు చేయడానికి వీలు లేదని.. దాన్ని విజయవాడ, గుంటూరు నగరాల అభివృద్ధికి కూడా కేటాయించాని వెంకయ్య అంటున్నాడు.
విజయవాడ, గుంటూరుల్లో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి.. తదితర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ వెయ్యి కోట్ల రూపాయాలను వెచ్చించాలని వెంకయ్య ఏపీ ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నాడు. మరి దీన్ని బట్టి ఆ వెయ్యి కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి కేటాయించనవి కాదని.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న స్మార్ట్‌సిటీ ల ప్రాజెక్టు కోసం ఆ డబ్బును వినియోగించనున్నారని స్పష్టమవుతోంది. మరి వెయ్యి కోట్లు స్మార్ట్‌సిటీలపై పెడితే.. ఏపీ రాజధానికి నిధుల సంగతేంటబ్బా?!