Begin typing your search above and press return to search.

జీఎస్టీతోచౌక ధ‌ర‌ల‌కే ఇళ్లుః వెంక‌య్య‌నాయుడు

By:  Tupaki Desk   |   30 Jun 2017 5:48 PM GMT
జీఎస్టీతోచౌక ధ‌ర‌ల‌కే ఇళ్లుః  వెంక‌య్య‌నాయుడు
X
జీఎస్టీ వ‌ల్ల‌ గృహ కొనుగోలుదారులకు భారీగా ఉపశమనం కలగ‌నుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. కొంత‌మంది ప‌న్ను ఎగ‌వేత‌దారులు మాత్ర‌మే జీఎస్టీని వ్య‌తిరేకిస్తున్నార‌ని చెప్పారు. గృహ యజమానులు
జీఎస్టీ, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్ (ఆర్ ఈ ఆర్ ఏ) వ‌ల్ల‌ క‌చ్చితంగా ల‌బ్ది పొందుతార‌ని తెలిపారు.

ప‌న్ను ఎగ‌వేత‌దారులు జీఎస్టీ నుంచి తప్పించుకునే అవకాశం లేద‌న్నారు. ఇన్పుట్ క్రెడిట్ కూడా బదిలీ అవుతుంద‌ని తెలిపారు. మే నుండి అమలులోకి వచ్చిన ఆర్ ఈ ఆర్ ఏ నిబంధనల నుంచి తప్పించుకోవడానికి మార్గం లేద‌న్నారు. క‌చ్చితంగా ఇళ్ల‌ ధరలు త‌గ్గుతాయని వెంక‌య్య నాయుడు అన్నారు. కేంద్రం, రాష్ట్రాలు నూతన రియల్ ఎస్టేట్ చట్టాన్ని త‌ప్ప‌నిస‌రిగా అమలు చేయాలని ఆయ‌న‌ చెప్పారు.

భూములు, ఇళ్లు రాష్ట్రాల ప‌రిధిలోని అంశాలయినప్ప‌టికీ త‌న బాధ్య‌త‌ను నెర‌వేర్చాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని వెంక‌య్య అన్నారు. ఢిల్లీలో గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో గణనీయమైన జాప్యం జరిగిందని, ఈ అంశం గురించి ఉత్తరప్రదేశ్ ప్ర‌భుత్వంతో చ‌ర్చిస్తాన‌ని తెలిపారు. నిర్మాణ రంగంలో జీఎస్టీని ప్ర‌భుత్వం 12 శాతం నుండి 18 శాతానికి పెంచిన విష‌యం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/