Begin typing your search above and press return to search.
అవును.. వెంకయ్య ఆంధ్రుడే?
By: Tupaki Desk | 17 Sep 2016 5:30 PM GMTసరిగ్గా గమనిస్తే.. ఈ మధ్యకాలంలో ప్రత్యేకహోదా అనే ప్రస్థావన ఎత్తినప్పుడల్లా - ఏపీకి జరిగిన అన్యాయం విషయంలో తప్పించుకుపోయే క్రమంలో వెంకయ్య నాయుడు నుంచి ఒకమాట పదే పదే వినిపిస్తుంది. ఏరు దాటాక తెప్ప తేలేయడం అనుకోవాలో లేక పునాదులను మరిచిపోయిన మేధావి అనుకొవాలో కానీ... "నేను ఏపీ ఎంపీని కాదు - నేను ఏపీ నుంచి ఎన్నిక కాలేదు" అనే మాటలు వెంకయ్య నోటనుంచి తరచూ వినిపిస్తున్న మాటలు. ఇప్పటికిప్పుడు తప్పించుకోవడానికి ఈ మాటలు ఉపయోగపడొచ్చు గాక.. కానీ ఈ మాటలు అనడం వెంకయ్య లాంటి సీనియర్ రాజకీయ నాయకుడికి ఎలా మనసొప్పుతుందో అర్ధం కావడంలేదు.
రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే క్రమంలో ఆయా రాష్ట్రాల నుంచి సీట్లు అందుబాటులో లేకపోతే మరో రాష్ట్రం నుంచి ఆ అవకాశం కల్పించడం సర్వసాధారణమైన విషయం. ఇది సీనియర్ పార్లమెంటేరియన్ వెంకయ్యకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కర్ణాటక నుంచి ప్రస్తుతం ఎన్నికైన వెంకయ్య.. ఏపీ కి ప్రత్యేక హోదా అనే ప్రస్థావన వచ్చినప్పటినుంచీ తాను ఏపీ మంత్రిని కాదని - ఏపీ ఎంపీని కాదని చెబుతుండటం పలు విమర్శలకు దారితీస్తుంది. సురేష్ ప్రభును ఏపీ నుంచి ఎంపిక చేశారు.. అంత మాత్రాన్న ఆయన ఏపీ మనిషి అయిపోతారా? రాజకీయ కారణాలతోనో - రాజకీయ ప్రయోజనాలతోనో ఏపీ నుంచి ఎంపికైనంత మాత్రాన్న సురేష్ ప్రభును ఏపీ ప్రజలు సొంతమనిషిగా చూస్తారా? ఇప్పుడు వెంకయ్య కర్ణాటక నుంచి ఎంపికైనంత మాత్రాన్న.. ఈయన మావాడు కాదని నెల్లూరు ప్రజలు భావిస్తారా? ఈ విషయాలు వెంకయ్యకు తెలియని విషయాలు అని మనం అనుకోలేం. అమెరికా వెళ్లిన ఎన్నారైలు... తాము ప్రస్తుతం భారతదేశంలో ఉండటం లేదు కాబట్టి, భారతీయ కంపెనీల్లో పని చేయడంలేదు కాబట్టి... అని మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుందో.. వెంకయ్య మాటలు కాస్త అటు ఇటుగా అలానే ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
1978లో ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్న సమయంలో నెల్లూరు జిల్లాలో ఉన్న 11 సీట్లలో 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే - బీజేపీ ఒక్క సీటు గెలవడం.. అదే విధంగా 1983లో ఎన్టీఆర్ గాల్లో కూడా 11 సీట్లలో 10 సీట్లు టీడీపీ గెలిస్తే - ఒక సీటు బీజేపీ గెలవడం తెలిసిందే. అయితే నాడు ఏపీ ప్రజలు ఇచ్చిన పునాదే కదా నేడు వెంకయ్యకు ఢిల్లీలో ఆ స్థాయి గౌరవం. కర్నాటక ఎంపీగా వెంకయ్యకు గుర్తింపు సంగతి కాసేపు పక్కనపెడితే.. ఏపీ నాయకుడిగానే వెంకయ్యను కేంద్రం గుర్తిస్తుందన్న విషయం మరిచిపోకూడదు.
ఏపీకి హోదా పక్కనేసి ప్యాకేజీ ఇచ్చి అన్యాయం చేసినా - హోదా పేరుతో ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట, అనంతరం నమ్మక ద్రోహం చేసినా కూడా ఏపీ ప్రజలకు వెంకయ్య సొంత మనిషే.. అంతటి సీనియర్ నాయకుడు - కేంద్రంలో చక్రం తిప్పుతున్న తెలుగు వాడిగా వెంకయ్య ఏపీ వాసులకు ఎప్పుడూ తమ ఇంటి పెద్దే! ఇది తెలిసిన తర్వాత కూడా "నేను ఏపీ ఎంపీని కాదు - నేను ఏపీ నుంచి ఎన్నిక కాలేదు.. అయినా కూడా ఏపీకి తెగ చేస్తున్నాను.. ఇదంత నా గొప్పతనమే తప్ప మరొకటి కాదు" అనే స్థాయిలో మాట్లాడటం వెంకయ్య మానేస్తారని ఏపీ ప్రజలు ఆశిస్తున్నారు!