Begin typing your search above and press return to search.

వారిద్దరికీ అదే ధ్యాస అంటున్నవెంకయ్య

By:  Tupaki Desk   |   27 Dec 2016 5:23 AM GMT
వారిద్దరికీ అదే ధ్యాస అంటున్నవెంకయ్య
X
నచ్చినోళ్లను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎంతగా పొగిడేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాటల మనిషిగా.. అంత్యప్రాసలతో అక్షరాల్ని ఆడుకునే ఆయన.. నచ్చినోళ్లను భజన చేయటంలో ముందుంటారు. ప్రధాని మోడీని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసేలా తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చిన నేపథ్యంలో మాట్లాడిన వెంకయ్య.. ఏపీకి మోడీ.. చంద్రబాబులు ఎంత అదృష్టమన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

ప్రధాని మోడీ అన్నీ ఇస్తారని.. ఏపీ ముఖ్యమంత్రి అన్నీ చేస్తారన్న వెంకయ్య.. ఇద్దరి జోడీ ఆంధ్రులకు వరంగా లభించిందని చెప్పారు. ఇద్దరికి పని తప్ప వేరే ధ్యాసే ఉండదన్న వెంకయ్య.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పేరు ఎత్తిన వెంటనే దేశ ప్రధమ ప్రధాని నెహ్రు గుర్తుకు వస్తారని.. రానున్న రోజుల్లో పోలవరం పేరు ఎత్తిన వెంటనే మోడీ.. చంద్రబాబులు గుర్తుకు రావటం ఖాయమన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు తొలిసారి 1981లోశంకుస్థాపన జరిగిందని.. అప్పట్లో తాను ఎమ్మెల్యేగా ఉండేవాడినని చెప్పిన వెంకయ్య నాటి విషయాల్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘పోలవరానికి పడిన పునాదిరాయి సమాధిరాయి అయ్యింది’’ అని విమర్శించేవాడినని గుర్తు చేసుకున్న వెంకయ్య.. పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందని ప్రశ్నించేవాడినని.. ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు సంకల్పించటం గొప్ప విషయంగా అభివర్ణించారు. పోలవరం పూర్తి అయిన వెంటనే రాయలసీమకు.. విశాఖకు నీళ్లు వస్తాయని చెప్పిన వెంకయ్య.. ఈ ప్రాజెక్టును యూపీఏ జాతీయ ప్రాజెక్టుగా పేర్కొందే తప్ప అంతకు మించి ఏమీ చేయలేదన్న ఆయన.. ఎన్డీయే ప్రభుత్వమే అంతా చేస్తుందని చెప్పుకొచ్చారు.

పోలవరం విషయంలో మోడీ కమిట్ మెంట్ గురించి చెబుతూ.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే పోలవరం ముంపు గ్రామాలపై నిర్ణయం తీసుకున్నారని.. తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రామాల్ని ఏపీకి తీసుకొచ్చి కలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందుకోసం ఆర్డినెన్స్ తెచ్చామన్న వెంకయ్య.. ఆంధ్రప్రదేశ్ కు విభజన సందర్భంగా జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు అరుణ్ జైట్లీ తనకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఏ పని చేసినా ప్రధాని మోడీకి.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన అరుణ్ జైట్లీకి క్రెడిట్స్ ఇచ్చేయటం.. ఏపీ విషయానికి వస్తే బాబును ఆకాశానికి ఎత్తేసే వెంకయ్య ఇలాంటి మాటలకు భిన్నంగా మాట్లాడితేనే ఆశ్చర్యపోవాలేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/