Begin typing your search above and press return to search.
వెంకయ్య కూడా కొత్తతరం రాజకీయం నేర్చేసుకున్నారు
By: Tupaki Desk | 10 April 2015 3:30 PM GMTరాజకీయాల్లో ఏ ఎండకా గొడుగు పట్టేవారు, ఏ రోటికాడ ఆ పాట పాడేవారు చాలామందే ఉంటారు.. ఆ నైజంతోనే ఎంతో ఎత్తుకు ఎదిగినవారూ ఉన్నారు. అదే సమయంలో ఏ విషయమైనా స్పష్టంగా, సూటిగా... కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడి తమ నిర్ణయాలు స్పష్టంగా చెప్పే నేతలూ ఉన్నారు.. వారూ ఆ తత్వంతోనే పైకొచ్చారు. అలా ఉన్నదున్నట్లుగా మాట్లాడే అగ్రనేతల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఒకరు. అయితే... ఇటీవల కాలంలో ఆయన తన నైజానికి విరుద్ధంగా గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన తిరుపతి ఎన్ కౌంటర్ పైనా అలాగే మాట్లాడారు.
ఆయన ఎన్ కౌంటర్ ను నేరుగా సమర్దించలేదు కాని, ఎర్రచందనం స్మగ్లింగ్ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడానికి హెచ్చరికలు చేస్తున్నదని, రక్షిత అడవులలోకి వెళ్లవద్దని చెబుతోందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా తాను దీనిపై ఏమి జరిగిందో తెలియకుండా స్పందించరాదని అన్నారు.వివరాలు రావల్సి ఉందని వెంకయ్య నాయుడు అన్నారు.అయితే బిజెపికి చెందిన కేంద్ర మంత్రి పొన్ను రాధాకృష్ణన్ మాత్రం తిరుపతి ఎన్ కౌంటర్ సామూహిక హత్యాకాండ అని అంటున్నారు. ఈ ఎన్ కౌంటర్ జరిగి నాలుగు రోజులవుతున్నా వెంకయ్య ఇంకా విషయం పూర్తిగా తెలియలేదనడం విచిత్రమే మరి. ఒకప్పుడు జనతా పార్టీ తరపున మానవ హక్కుల కోసం పోరాడిన వెంకయ్య నాయుడుకు ఇప్పుడు కర్ర విరగకుండా పాము చావకుండా మాట్లాడడం తగదేమో.