Begin typing your search above and press return to search.
విరాళంతో సరిపెడుతున్న వెంకయ్య
By: Tupaki Desk | 21 Nov 2015 8:42 AM GMTఏపీ పట్ల కేంద్రం వైఖరి ఏమాత్రం మారినట్లుగా లేదు.. బీహార్ లో బొక్క బోర్లా పడిన తరువాత కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంజూస్ విధానం మారలేదు. గత ఏడాది హుద్ హుద్ తుపానుతో ఉత్తరాంధ్ర బిక్కచచ్చిపోతే కొత్తగా గద్దెనెక్కిన ఊపులో మోడీ ఏకంగా వెయ్యి కోట్లు సహాయం ప్రకటించారు.. అయితే... ఆ తరువాత కాకిలెక్కలన్నీ వేసి రకరకాల సర్దుబాట్లు చేసి గట్టిగా 150 కోట్లు విదిల్చారు. ఇప్పుడు దక్షిణాంధ్రలో భారీ వర్షాల విషయంలోనూ కేంద్రం అదే తరహాలో వెళ్తోంది.
రాష్ట్రాల విషయంలో తండ్రి పాత్ర పోషించాల్సిన కేంద్రం దూరపుబంధువులా వ్యవహరిస్తోంది. జాతీయ రహదారులు సహా రోడ్లన్నీ ఎక్కడికక్కడ నలభై ఏభై అడుగుల మేర పూర్తిగా గండ్లు పడి చెన్నై - హౌరా మధ్య రాకపోకులు పూర్తిగా నిలిచిపోయి.. పంటలు నాశనమై.. చుట్టూ నీరు నిలిచిపోయి నానా ఇబ్బందులు పడిన దక్షిణాంధ్ర జిల్లాకు సహాయం ప్రకటించాల్సిన కేంద్రం ఆ పని చేయకపోగా బీజేపీ తరఫున విరాళం ప్రకటించింది. వరద బాధిత ప్రాంతాలకు మిత్రపక్షంగా, కేంద్ర ప్రభుత్వంగా ఆదుకోవాల్సిన బీజేపీ కేవలం కోటి రూపాయల విరాళం ప్రకటించి ఊరుకుంది. ఆ ప్రకటన చేసింది మరెవరో కాదు.. సాక్షాత్తు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. వెంకయ్య నాయకుడు సొంత జిల్లా నెల్లూరు భారీ వర్షాలకు అతి దారుణంగా దెబ్బతింది. సుమారు 300 చెరువులు తెగిపోయాయి. రోడ్లన్నీ గండ్లు పడ్డాయి. ఇళ్లు మునిగిపోయాయి. గోడలు కూలిపోయాయి. రైళ్లు నిలిచిపోయాయి. సొంత జిల్లా అత్యంత దారుణంగా దెబ్బతిన్నా కూడా కేంద్రమంత్రిగా, బీజేపీ అగ్రనాయకుల్లో ఒకరిగా ఉన్న వెంకయ్య కోటి రూపాయలకు మించి సాధించలేకపోవడం సిగ్గుచేటే. అది కూడా విరాళంగా.. స్వయంగా ఆయనే ప్రకటించడం అందరూ నవ్వుకునేలా చేస్తోంది. వరద సహాయక చర్యల కోసం బీజేపీ కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నుంచి భారీ ఎత్తున సహాయం తేవాల్సిన వెంకయ్య ఇలా చేశారేమిటని నెల్లూరు జిల్లా ప్రజలు నిరాశచెందుతున్నారు.