Begin typing your search above and press return to search.
అది తెలిశాకే వెంకయ్య బీజేపీ చేరాడట!
By: Tupaki Desk | 8 April 2015 12:30 PM GMTకేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. ఇప్పుడే కాదు, దశాబ్దాల నుంచి భారతీయ జనతా పార్టీ తరపున ఏపీలో పనిచేస్తున్న వ్యక్తి. ఏపీలో ఊడలు లేని చెట్టులా కనిపించే భారతీయ జనతా పార్టీ తరపున ఆయన ముఖ్యనేతగా ఉన్నారు. మొదట్లో ఎమ్మెల్యేగా గెలిచినా ఆ తర్వాత ఆయన నామినేటెడ్ ఎంపీగానే మిగిలిపోయాడు. భారతీయ జనతా పార్టీ అంతోఇంతో బలంగా ఉండే కర్ణాటక నుంచి ఆయన ఎంపీగా నామినేట్ అవుతూ వస్తున్నాడు.
వెనుకటికి వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వెంకయ్య ఇప్పుడు మోడీ సర్కారులో కూడా మంచి ప్రాధాన్యతే పొందుతున్నాడు! మరి ఇలాంటి వెంకయ్య తన రాజకీయ ప్రస్థానంలోని ఒక ఆసక్తికరమైన ఘట్టాన్ని తాజాగా వివరించాడు. ఆయన చెబుతున్న ప్రకారం చూస్తే.. వెంకయ్య మొదట కాంగ్రెస్‌లో చేరాల్సిందట!
పొలిటికల్ జర్నీ ప్రారంభించాలన్న తొలి రోజుల్లో తన మామ తనను ఒక కాంగ్రెస్ నేత వద్దకు తీసుకెళ్లాడని వెంకయ్య చెప్పాడు. ఆ కాంగ్రెస్ నేతనేమో వెంకయ్యను బీజేపీలోకి వద్దు.. కాంగ్రెస్‌లో చేరు అన్నారట!
బీజేపీ ఉత్తరాది పార్టీ, బ్రాహ్మణ పార్టీ.. శాకాహారం తినే వారికే అక్కడ ప్రాధాన్యత అని తేల్చి చెప్పారట ఆ కాంగ్రెస్ నేత. దీంతో వెంకయ్య నాయుడు ఆలోచనలో పడిపోయాడు. తను మాంసాహారం తింటాను, బ్రాహ్మణుడిని కాదు ఎలాగబ్బా అనుకొన్నారట!
అయితే ఈ విషయం గురించి సంఘ్ పరివార్‌లో తెలిసిన వారి వద్ద విచారిస్తే... అలాంటిదేమీ లేదు, మాంసం తినే వాళ్లు కూడా బీజేపీలో చేరవచ్చు అని ఆయన వివరించాడట. దీంతో వెంకయ్య ధైర్యంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకొన్నాడు... ఈ ఉదంతాన్ని వెంకయ్య నాయుడే స్వయంగా వివరించాడు!
మరి దీన్ని బట్టి మాంసం తినడానికి అడ్డేమీ లేదు అనుకొనే.. వెంకయ్య బీజేపీలో జాయిన్ అయ్యాడా! లేక బీజేపీ అన్ని రకాల వారినీ అక్కున చేర్చుకోగలదని సందేశం ఇస్తున్నాడా!