Begin typing your search above and press return to search.

కేవీపీపై ఈ ప్ర‌శంస‌లేంటి వెంక‌య్యా

By:  Tupaki Desk   |   11 Sep 2016 8:13 AM GMT
కేవీపీపై ఈ ప్ర‌శంస‌లేంటి వెంక‌య్యా
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డం - కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీకే ప‌రిమితం కావ‌డం - దీనిని ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆహ్వానించ‌డం వంటి ప‌రిణామాలు ఏపీ రాజ‌కీయాల్ని స‌మూలంగా క‌డిగిపారేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా గౌర‌వించుకుంటూ వ‌స్తున్న నేత‌లు సైతం మీడియా గొట్టాల సాక్షిగా రోడ్ల‌పై ప‌డి కామెంట్ల‌తో కొట్టేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీకి ఏదైనా వ‌స్తే బాగుండున‌ని కేంద్రంలో త‌న‌వంతు చ‌క్రం తిప్పుతున్న సీనియ‌ర్ బీజేపీ నేత - కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు సెంట‌ర్‌ గా విమ‌ర్శ‌లు పెరిగిపోయాయి. ఆయ‌న కూడా అంతే సీరియ‌స్‌ గా సిన్సియ‌ర్‌ గా కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీ నేత అయిన వెంక‌య్య కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - దివంగ‌త వైఎస్ ఆత్మ‌గా ఐడెంటిటీ తెచ్చుకున్న కేవీపీని వ‌రుస పెట్టి పొగిడేస్తున్నారు. నిజ‌మైన ఉమ్మ‌డి రాష్ట్ర భ‌క్తుడు కేవీపీ యేన‌ని వెంక‌య్య దంచికొడుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేత‌ల దాష్టీకం వ‌ల్లే తెలుగు రాష్ట్రాలు కొట్టుకు చ‌స్తున్నాయ‌ని విమ‌ర్శ‌లు సంధిస్తున్న బీజేపీ - టీడీపీలోనూ తీవ్ర అయోమ‌యం నెల‌కొంది. ఇంత‌కీ.. వెంక‌య్య .. కేవీపీని ఎందుకు ప్రైజింగ్ చేస్తున్నారంటే.. . ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ - ప్రత్యేక తెలంగాణ వద్దని ఎవరూ పోరాడలేదు.. అలా పోరాడిన ఏకైక వ్యక్తల్లా కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు అంటూ వెంకయ్య చెప్పుకొచ్చారు. ఆయన పట్టువదలని విక్రమార్కుడని ఆయన ప్రశంసించారు.

కేవీపీ తప్ప మిగతా వారంతా ఆనాడే సర్దేశారని వెంకయ్య తెలిపారు. నాటి కాంగ్రెస్ తప్పిదమే నేడు పెను సమస్యగా మారిందని అన్నారు. విభజన బిల్లుకు ఆమోదం పలికే వేళ - రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తాను మాట్లాడుతుంటే, తన గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందన్నారు. తాను విభజనకు వ్యతిరేకమని మొదటి నుంచి వాదిస్తూ వచ్చారని, మిగతా ఎంపీలంతా ఏదో ఒక దశలో రాష్ట్రం రెండు ముక్కలైతేనే మంచిదని వ్యాఖ్యానించిన వారేనని వెంకయ్య అన్నారు.

దీంతో ఇప్పుడు కాంగ్రెస్ స‌భ్యుడైన కేవీపీని తిట్టాలో వెంక‌య్య మాదిరి పొగ‌డాలో తెలీక బీజేపీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న అవుతున్నారు. అయితే, ప్ర‌స్తుతం హోదా విష‌యంలో రాష్ట్రం ర‌గిలిపోతున్న వేళ ఈ కామెంట్లు ఎందుకని వారిలో వారే చ‌ర్చించుకుంటున్నారు. ఇదిలావుంటే, మొన్నామ‌ధ్య మీడియాతో మాట్లాడిన కేవీపీ.. బీజేపీపై ఫైర్ అయ్యారు. హోదాపై తాను పెట్టిన ప్రైవేటు బిల్లును అడ్డుకున్నార‌ని బీజేపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ‌డం గ‌మ‌నార్హం.