Begin typing your search above and press return to search.

కీలక ఘట్టం పూర్తి అయ్యే వేళ మీడియాకు వెంకయ్య ఎంత ప్రయారిటీ ఇచ్చారంటే?

By:  Tupaki Desk   |   11 Aug 2022 4:23 AM GMT
కీలక ఘట్టం పూర్తి అయ్యే వేళ మీడియాకు వెంకయ్య ఎంత ప్రయారిటీ ఇచ్చారంటే?
X
అనుకున్న రోజు రానే వచ్చింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలిసినా.. దాన్ని ఎలా పూర్తి చేయాలన్న విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తారు. అతి చిన్నస్థాయి నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెట్టి.. దేశంలో కీలకమైన రెండో స్థానమైన ఉప రాష్ట్రపతి పదవి వరకు చేరుకున్న తెలుగోడు వెంకయ్యనాయుడు తన పదవికి పదవీ విరమణ చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరో కీలక ఘట్టాన్ని ద్విగ్విజయంగా ముగించిన ఆయన.. తన రాజకీయ ఆరోహణలో కీలకమైన మీడియా ప్రతినిధులతో కొంత సమయాన్ని గడిపారు.

ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన చిట్ చాట్ లో వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. మనసు విప్పి మాట్లాడారు. తద్వారా లతో ఇంతకాలం తనకు దన్నుగా నిలిచిన మీడియా ప్రతినిధులకు తానిచ్చే ప్రయారిటీ ఏమిటన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు. చివర్లో పసందైన తెలుగు వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఉప రాష్ట్రపతి హోదాలో చివరి రోజున మీడియాకు కాస్తంత సమయాన్ని గడిపిన ఆయన.. పలు అంశాల్ని చర్చించారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయన్నో ఆసక్తికర ప్రశ్నను సంధించారు. ఆయన ఎప్పుడూ వార్తల్లో ఎలా ఉండగలరన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ''పొజిషన్ లో ఉన్నా అప్పోజిషనులో ఉన్నా. ఏ పొజిషన్ లేకున్నా వార్తల్లో ఉంటాను. ఎందుకంటే.. మీడియాకు కావాల్సిన సమాచారం ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది'' అని వ్యాఖ్యానించటం గమనార్హం.

నిజమే.. వెంకయ్య మీడియాతో ఫ్రెండ్లీగా ఉంటారు. దీంతో చాలా విషయాల్ని ఆయన చక్కబెడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఏకాభిప్రాయానికి కారణమవుతుంటారు. మిగిలిన బీజేపీ నేతలు ఎవరూ చేయలేని ఎన్నో పనులను వెంకయ్య ఒంటి చేత్తో చేయటానికి కారణం.. మీడియాతో ఆయనకున్న సంబంధాలే.

నిజానికి ఈ రోజున బీజేపీలో ఆయన మాదిరి మీడియాతో సన్నిహితంగా మాట్లాడే నేతలే లేరని చెప్పాలి. ఒకవేళ మాట్లాడినా.. అధికార దర్పం చూపించటమే తప్పించి.. మరింకేమీ ఉండదు. వెంకయ్య నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిన కీలకమైన పాయింట్ ను మిస్ అయ్యిందనే చెప్పాలి. ఎంత కాదనుకున్నా.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మార్గంగా మీడియా ఉందన్న విషయాన్ని వెంకయ్య లాంటి నేతలు నమ్మితే.. అందుకు భిన్నంగా అవేమీ అక్కర్లేదన్నట్లుగా మోడీషాల తీరు ఉంటుందని చెప్పాలి.

ఇదే బీజేపీకి రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితికి కారణమవుతుందన్నమాట వినిపిస్తోంది. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా వెంకయ్య నోటి నుంచి వచ్చే చమత్కారాల గురించి తెలిసిందే. తాజా భేటీలో ఆయన ఒక మాటను చెప్పటం ద్వారా.. తన తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. అదేమంటే.. 'అయితే ప్రెసిడెంటు లేదా డిసిటెంటు (అసమ్మతి(.. ఏదీ కాకపోతే రెసిడెంటు (ఇంటికే పరిమితం) అనే భావన నాకు నచ్చదు' అన్న మాటతో తానేమిటో వెంకయ్య చెప్పేశారని చెప్పాలి.