Begin typing your search above and press return to search.
తొలి సెషన్ లో వెంకయ్య అదరగొట్టేసినట్లేనట!
By: Tupaki Desk | 6 Jan 2018 6:09 AM GMTకష్టపడతారన్న పేరున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి పని తీరుపై తాజాగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉప రాష్ట్రపతి హోదాలో రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరించే ఆయన.. తనదైన శైలిలో వ్యవహరించి రాజ్యసభ బండి లాగిస్తున్నారన్న కితాబులు లభిస్తున్నాయి. ఉప రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత జరిగిన మొదటిసారి జరిగిన పూర్తి స్థాయి సమావేశాలు ఇవే. ఈ సందర్భంగా తనదైన మార్క్ తో రాజ్యసభను సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన క్రెడిట్ వెంకయ్యకు దక్కింది.
సహనంతో వ్యవహరించటం.. సమయస్ఫూర్తితో క్లిష్టమైన అంశాల్ని సైతం పరిష్కరించి సభను సజావుగా జరగటానికి కృషి చేసి అందరి మన్ననలు పొందారు వెంకయ్య. అధికారపక్షానికి బలం తక్కువగా ఉన్న పెద్దల సభకు ఛైర్మన్ గా వ్యవహరించే ఆయన.. సంఖ్యా బలంతో సంబంధం లేకుండా అన్ని పార్టీల ఎంపీలు మాట్లాడే విషయానికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా.. అన్నిపార్టీల మనసుల్ని దోచుకున్నారు.
పార్లమెంటు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న కురియన్ మాట్లాడుతూ.. వెంకయ్య రాజ్యసభ ఛైర్మన్ అయ్యాక సభలో చాలా సమస్యలు పరిష్కారమైనట్లు వెల్లడించారు. ఆయన లీడర్ షిప్ లో సభ సజావుగా జరుగుతుందన్నారు. గతానికి భిన్నంగా సభ జరుగుతోందన్న క్రెడిట్ తో పాటు.. మూసధోరణితో ఉండే పలు సంప్రదాయ అంశాలకు తనదైన మార్క్ తో మార్పులు చేర్పులు సూచిస్తూ అన్ని పార్టీ నేతల్ని మెప్పిస్తూ వెళుతున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. వెంకయ్య సమర్థత మరోసారి అందరి దృష్టిలో పడిందని చెప్పక తప్పదు.