Begin typing your search above and press return to search.
చెంబుడు మట్టి.. నీళ్లు ఇచ్చిన లెక్క మరిచారు?
By: Tupaki Desk | 15 March 2016 9:40 AM GMTలోక్ సభ.. రాజ్యసభల్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చింది. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవటంపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన చర్చతో ఉభయ సభలు అట్టుడిగిపోయాయి. విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చని వైనంపై కాంగ్రెస్ సభ్యులు మండిపడగా.. బీజేపీ నేతలు దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. రాజ్యసభలో టీడీపీ నేత సీఎం రమేష్ బీజేపీకి మద్దతుగా నిలవటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. రాజ్యసభతో పాటు.. లోక్ సభలోనూ ఏపీ ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్ బలమైన వాణిని వినిపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో కేందమంత్రి వెంకయ్యనాయుడు తీవ్రస్వరంతో ఏపీకి కేంద్రం ఎన్నో చేసిందంటూ పెద్ద జాబితాను చదివారు.
లోక్ సభలోని సభ్యులకు ఈ లిస్ట్ లో ఉన్న అంశాలు ఎన్ని జరిగాయో తెలీవు కానీ.. ఏపీలోని ప్రజలకు ఇవన్నీ తెలిసినవే. ఈ మధ్యన రాజమండ్రిలో నిర్వహించిన సభలో బీజేపీ చీఫ్ చెప్పిన తీరులోనే.. ఏపీకి ఎంతో చేసినట్లుగా వెంకయ్య చెప్పుకొచ్చారు. విభజన సందర్భంగా నాడు చెప్పిన ఏ విషయాన్నిసరిగా అమలు చేయలేదన్న విషయాన్ని తెలివిగా డైవర్ట్ చేసిన వెంకయ్య.. పోలవరంకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్డినెన్స్ ద్వారా మార్పులు చేసినట్లు గొప్పలు చెప్పుకున్నారే కానీ.. పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధుల్ని మాత్రం కేటాయించలేదన్న అసలు విషయాన్ని వదిలేశారు.
ఏపీకి ఎంతో చేసినట్లుగా వెంకయ్య చెప్పిన మాటలన్నీ కూడా మాటల హడావుడి తప్పించి మరింకేమీ లేదనే చెప్పాలి. ఏపీకి ఎంతో చేసినట్లుగా వెంకయ్య చదివిన జాబితా చూసినప్పుడు అనిపించే మాట ఒక్కటే.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీ తనతో పాటు తెచ్చిన చెంబుడు పార్లమెంటు మట్టి..మరో చెంబుడు పవిత్ర జలాలు చెప్పలేదన్న విషయం గుర్తుకురాక మానదు. ఏపీకి ఎంతో చేసినట్లు చెబుతున్నా.. ఏపీ టీడీపీ ఎంపీలు నోట మాట రానట్లుగా ఉండిపోవటం గమనార్హం.