Begin typing your search above and press return to search.
తెదేపా పోతే ఏంటి అంటున్నపెద్దాయన!
By: Tupaki Desk | 6 Sep 2015 5:56 AM GMTఆయనేమో కేంద్రంలో చక్రం తిప్పుతున్న కీలక భాజపా నాయకుడు. కాకపోతే.. ఆయన తెలుగుదేశం పార్టీకి రక్షణ కవచం అనే విమర్శలను నిత్యం ఎదుర్కొంటూ ఉంటారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తొలినాటినుంచి.. ఇలాంటి విమర్శలు వినిపిస్తూనే ఉండగా.. తాజాగా మరోసారి.. ఆయన అదే వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇంతకూ ఆయనెవరో అర్థమైపోయిందిగా.. ముప్పవరపు వెంకయ్యనాయుడు. జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు తిమ్మిని బమ్మిని చేయగల మాటల మరాఠీ. తెలుగురాష్ట్రం విభజనకు కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు.. రాజ్యసభలో ప్రత్యేకహోదా గురించి పోరాడిన చరిత్ర ఆయనకుంది. అయిదేళ్లిస్తే చాలదు.. పదేళ్లూ ఇస్తే తప్ప రాష్ట్రం అన్యాయం అయిపోతుంది అని గళం వినిపించిన ఆయన.. ఇప్పుడు ఆ మాటలు ప్రస్తావిస్తే ఎన్ని డొంకతిరుగుడు స్టేట్ మెంట్ లు ఇస్తారో మనం చూస్తూనే ఉన్నాం. పైగా ఆయన ఇప్పుడు ప్రత్యేకహోదా విషయంలో.. తెలుగుదేశానికి రక్షణ కవచంలా పనిచేయడానికి కూడా సిద్ధపడుతున్నారు.
కేంద్రంలో భాగస్వామి పార్టీ అయినప్పటికీ కూడా ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఏమీ సాధించలేకపోతున్నదనే విమర్శ చాలా కాలంగా ఉంది. ఇటీవలి కాలంలో ప్రత్యేకహోదాకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి నిందలు ఎక్కువయ్యాయి. కేంద్రాన్ని డిమాండ్ చేసే స్థితిలో తెలుగుదేశం లేకపోవడం వారికి ఇబ్బందిగా మారింది. పైగా పోరాడ్డానికి కూడా ప్రయత్నించకపోవడం తెదేపా వైఫల్యంగా.. ప్రజలను నమ్మింపజేయడంలో వైకాపా సక్సెస్ అయింది. కొన్నాళ్లుగా ప్రత్యేకహోదా గురించి ఎంత రభస జరుగుతున్నదో.. తెలుగుదేశాన్ని వైకాపా ఎన్ని రకాలుగా నిందిస్తున్నదో అంతా చూస్తూనే ఉన్నారు.
కేంద్రంలోని మంత్రి పదవులనుంచి తెదేపా తప్పుకుంటే.. హోదా దానంతట అదే వస్తుందని జగన్ డిమాండ్ చేశారు కూడా. కానీ పదవుల్ని వదలుకోవడం వారికి చాలా కష్టం కావొచ్చు. కానీ ఈ విషయంలో తెదేపాను ప్రజలు కూడా తిట్టకుండా కాపాడడానికి వెంకయ్యనాయుడు పూనుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన తాజాగా ఢిల్లీలో మాట్లాడుతూ.. ఈ ప్రస్తావన రాగానే.. కేంద్రంనుంచి తెదేపా వైదొలగినంత మాత్రాన ప్రత్యేక హోదా వస్తుందని అనుకోవడం అవివేకం అని వైకాపా వారికి హితవు చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం అంటూ వెంకయ్య పాతపాటే పాడుతున్నారు గానీ.. తెలుగుదేశం వారి పదవులకు, ప్రత్యేకహోదాకు సంబంధం లేదని అంటూ.. ఆ పార్టీ వారి పదవులకు రక్షణ గోడలాగా అడ్డుపడుతున్నారు.
వెంకయ్యకు తెదేపా పై అభిమానం ఉంటే ఉండొచ్చు గాక.. వారు పదవులు కోల్పోకుండా.. కాపాడాలని అనుకోవచ్చు గాక.. కానీ ఆ అభిమానంలో కొంత సొంత రాష్ట్రం మీద కూడా చూపిస్తే బాగుటుందని జనం అనుకుంటున్నారు. కేంద్రంనుచి తప్పుకుంటే పదవులు రాదని అంటున్నారు సరే.. ఏంచేస్తే హోదా వస్తుందో వెంకయ్య మార్గనిర్దేశనం చేయొచ్చు కదా అని కొందరి వాదన. అయినా తెదేపా తప్పుకుంటే.. అది ఎన్డీయే కూటమి వైఫల్యం కిందికి వస్తుంది గనుక.. ఆయన ఇలా డొంకతిరుగుడుగా చెబుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.