Begin typing your search above and press return to search.

శతాబ్దపు జోక్ అంటూ సింఫుల్ గా తీసేశారే

By:  Tupaki Desk   |   3 Nov 2015 4:49 AM GMT
శతాబ్దపు జోక్ అంటూ సింఫుల్ గా తీసేశారే
X
వారూ వీరు అన్న తేడా లేకుండా మత అసహనంపై దేశంలోని పలు వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తం కావటం తెలిసిందే. రచయితలు.. కళాకారులు.. సెలబ్రిటీలు.. పారిశ్రామికవేత్తలు ఇలా పలు రంగానికి చెందిన వారు మత అసహనంపై తమ అసహనాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఇలాంటి వాతావరణం దేశానికి ఇబ్బందికరమన్నది వారి ఆందోళన.

ఈ అంశంపై తాజాగా కేంద్రమంత్రి.. బీజేపీ సీనియర్ మంత్రి వెంకయ్యనాయుడు తేలిగ్గా తీసేశారు. దేశంలో సహనం తగ్గిందని.. అసహనం పెరిగిందని కాంగ్రెస్ ఆరోపించటాన్ని ఈ శతాబ్దపు జోక్ గా అభివర్ణించారు. కుల మతాలను ఉపయోగించి దేశంలో విభజన రాజకీయాలకు కాంగ్రెస్ బీజం వేసిందని మండిపడ్డారు. సహనశీలతపై బీజేపీకి కాంగ్రెస్ పాఠాలు చెప్పటం దెయ్యాలు వేదాలు బోదించినట్లు అవుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తన విమర్శలకు పలు ఉదంతాల్ని ఉదాహరణగా చూపించిన వెంకయ్య.. దేశంలో ఎమర్జెన్సీ.. కాశ్మీర్ పండిట్లపై దాడి.. సిక్కుల ఊచకోత ఇలాంటివెన్నో అంశాలను ప్రస్తావించారు. తమ హయాంలో జరిగిన వాటిపై కాంగ్రెస్ సమాధానం చెప్పిన తర్వాత సహనశీలతపై కాంగ్రెస్ మాటలు చెబితే బాగుంటుందని సూచించారు. కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనను శతాబ్దపు జోక్ గా తేల్చేయటం ద్వారా వెంకయ్య తన వైఖరిని స్పష్టంగా చెప్పేసినా.. కాంగ్రెస్ డబుల్ స్టాండ్ గురించి.. దేశంలో ఇప్పటి పరిస్థితులకు కాంగ్రెస్ ఎలా కారణమైందన్న విషయాన్ని మరింత అర్థమయ్యేలా చెప్పి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.