Begin typing your search above and press return to search.
బాబు నెత్తిన పాలుపోసిన వెంకయ్య
By: Tupaki Desk | 8 Sep 2016 2:46 PM GMTఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం - తదనంతరం ఏపీలో నెలకొన్న పరిణామాలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తన అసంతృప్తిని వెల్లడించారు. ఇదే సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయంలో గొప్ప భరోసా మాటలు చెప్పారు. హోదా కోసం నిన్నటి వరకూ తాను పట్టుబట్టానని అయితే ఏపీకి హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పకనే చెప్పిందన్నారు. తనను మోసగాడు అని ప్రతిపక్షాలు మాట్లాడటం సరికాదని వెంకయ్య నాయుడు అన్నారు. వాస్తవాలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ కు విభజన కారణంగా నష్టం జరిగిందని తాను మొదటి నుంచి వాదించానని పేర్కొన్నారు. హోదా ఇచ్చే ఆస్కారం లేనప్పుడు ప్రత్యేక ప్యాకేజీ వెసులుబాటు ఇవ్వాలని కోరానని తెలిపారు.విభజన చేసినవారే ప్రధాని దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని వెంకయ్య నాయుడు మర్శించారు. 13వ షెడ్యుల్ సెక్షన్ 93లో పదజాలం వాడినవారినే పరిశ్రమలు ఎందుకు రాలేదో అడగొచ్చన్నారు. విభజన చట్టంలో వాడిన పదజాలం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. ఆర్థిక సంఘం చెప్పిన ప్రకారం లోటు ఎవరికున్నా కేంద్రమే భర్తీ చేస్తోందని వెంకయ్య నాయుడు తెలిపారు. బెంగాల్ - ఏపీ - ఒడిశాలతో ఇతర కొన్ని రాష్ట్రాలకు ఆర్థిక లోటు ఉంటుందని ఆర్థిక సంఘం చెప్పిందని వివరించారు. నిధుల పంపిణీపై 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను అందరూ స్వాగతించారన్నారు. ఆర్థిక సంఘం నిర్ణయం మేరకు ఎవరికీ హోదా ఇచ్చే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. విశాఖ - విజయవాడ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. రైల్వే జోన్ పై ప్రభుత్వం స్పష్టమైన పరిశీలన చేస్తోందని చెప్పారు.
పోలవరం నిర్మాణానికి అయ్యే నిధులను నూటికి నూరు శాతం కేంద్రమే భరిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. పోలవరం నిధుల కేటాయింపుపై చట్టబద్ధత కూడా వస్తోందని స్పష్టం చేశారు. పోలవరం తెలుగు ప్రజల జీవనధార అని పేర్కొన్నారు. విభజన చట్టంలో పోలవరంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రధాని మోడీ మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఆర్డినెన్స్ చేయించారని వివరించారు. ఆర్డినెన్స్ ను చట్ట రూపంలో తెచ్చే ప్రక్రియను కూడా వెంటనే పూర్తిచేశామని తెలిపారు. పోలవరం ప్రారంభమై 34 ఏళ్లు అయిందని - మూడేళ్లలోనే పోలవరం పూర్తి కావాలని మాట్లాడేవారు అప్పుడెటు వెళ్లారని ప్రశ్నించారు. పెట్రోలియం శాఖ కింద రాష్ట్రానికి రూ.50వేల కోట్ల సంస్థలు వస్తున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య తెలిపారు. కాకినాడ-విశాఖ మధ్య రూ.30వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ పెట్రోలియం కేంద్రం నుంచి వస్తోందన్నారు. అలాగే విశాఖ - విజయవాడ - తిరుపతి విమానాశ్రయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి సాధారణంగా రావాల్సిన నిధుల కన్నా ఎక్కువగానే ఇచ్చామని వివరించారు. బకింగ్ హమ్ కెనాల్ లో జలరవాణాకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. రాజధాని చుట్టూ రహదారుల అభివృద్ధి బాధ్యతను కూడా కేంద్రం తీసుకుందన్నారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా రాష్ట్రానికి మేలు చేయాలనే చూస్తున్నామని తెలిపారు.
తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేశాయని.. కలిసే ఉంటాయని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తాము కలిసి ఉంటే వారికి గిట్టడం లేదన్నారు. చంద్రబాబు భయపడుతున్నారని కొందరు మాట్లాడుతున్నారని, అసలు భయపడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రాలు ముందుకెళ్లలేవని స్పష్టం చేశారు. హోదా పేరిట ఆందోళన చేసేవారు చంద్రబాబు రాజీనామా చేయాలని అంటున్నారని, చంద్రబాబు దిగిపోతే ఆ పదవి వస్తోందని కొందరు డ్రామాలు ఆడుతున్నారని వెంకయ్యనాయుడు విమర్శించారు.