Begin typing your search above and press return to search.
ఏపీ ప్రజలు ఎన్ని పంచ్ లు వేయాలో?
By: Tupaki Desk | 8 Sep 2015 6:07 PM GMTఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోడీ.. కేంద్రమంత్రి వెంకయ్యలపై ధ్వజమెత్తుతూ వారిపై ఏపీలోని పోలీస్ స్టేషన్ లలో కేసులు పెట్టటం తెలిసిందే. తాజా ఆందోళనతో.. విభజన కారణంగా ఏపీకి కలిగిన నష్టాన్ని తనదేం తప్పులేదన్నట్లుగా వ్యవహరించే వైఖరిని ప్రదర్శిస్తున్నారు. చేయాల్సిందంతా చేసేసి.. ఈ రోజు తమ తప్పేం లేనట్లుగా.. తప్పంతా అధికారపక్షానిదే అన్నట్లుగా వ్యవహరించటంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాజాగా ఓ పంచ్ వేశారు.
తనపై పెడుతున్న కేసుల గురించి స్పందించిన వెంకయ్య.. సూర్యభగవానుడి కారణంగా వర్షాలు పడలేదంటూ ఆయనపై కూడా కేసులు పెట్టేస్తారేమో? అంటూ పంచ్ వేసేశారు. రాజకీయ ఉన్మాదంతో వ్యవహరిస్తూ.. ప్రచార కాంక్షతో ఇలాంటి పనులకు కాంగ్రెస్ పాల్పడుతుందని మండిపడ్డారు.
పంచ్ వరకూ బాగానే ఉన్నా.. విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విషయంలో మోడీ సర్కారు వెనుకబడి ఉందన్నది వాస్తవం. ఈ విషయంపై కొంతమేర అన్నా ప్రయత్నించి ఉంటే.. ఈ రోజు కాంగ్రెస్ మీద విమర్శలు చేసేందుకు అవకాశం ఉండేది. తన మీద కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయగానే పంచ్ లు వేస్తున్న వెంకయ్య.. తన మాటలతో మాయదారి హామీలిచ్చినందుకు ఆయనపై ఏపీ ప్రజలు ఇంకెన్ని పంచ్ లు వేయాలి?