Begin typing your search above and press return to search.
రాజకీయాలపై వెంకయ్యకు విరక్తి పుట్టిందా?
By: Tupaki Desk | 23 Nov 2021 2:00 PM ISTబీజేపీ జాతీయ రాజకీయాలను ఊపు ఊపిన వెంకయ్య నాయుడు ఇప్పుడు మోడీ షాల రాకతో లూప్ హోల్ లోకి వెళ్లిపోయారు. ఉపరాష్ట్రపతిగా నియామకం అయ్యి ఉత్సవ విగ్రహంగా మారారు. అయితే నేటి రాజకీయాలకు ఆయన కన్వర్ట్ కాలేదు. బీజేపీ పెద్దలందరినీ సైడ్ చేసినా మోడీ షాలు వెంకయ్యను కూడా ఉపరాష్ట్రపతిగా పంపి మమ అనిపించారు.
ఈ క్రమంలోనే రాజకీయాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేనే లేదని తేల్చిచెప్పారు. వాటి మీద తాను అసలు మాట్లాడను అని.. ఇక మీదట ఆ రంగంలోకి రాను అంటూ స్పష్టంగా చెప్పేశారు.
విశాఖపట్నంలో తాజాగా పర్యటిస్తున్న వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా వర్ధమాన రాజకీయాల మీద తన భావాలపై ఓపెన్ గా మాట్లాడారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల తీరు పూర్తిగా మారాలని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఏపీ అసెంబ్లీ తీరుపై పరోక్షంగా వెంకయ్య విసుర్లు విసిరారు. చట్టసభల్లో నాణ్యమైన చర్చలు అర్థవంతంగా జరగడం లేదని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకనాటి రాజకీయ నేతగా తాను ఈ పరిణామాల పట్ల ఆవేదన చెందుతున్నానని చెప్పుకొచ్చారు. అభివృద్ధి ఉంటేనే శాంతి ఉంటుందని వెంకయ్య వ్యాఖ్యానించడం విశేషం. ప్రజలూ అభివృద్ధినే కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
మొత్తానికి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ మేధావి వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.