Begin typing your search above and press return to search.
ఆ పార్టీలో జవసత్వం లేదంటున్న వెంకయ్య
By: Tupaki Desk | 5 Jun 2017 5:53 AM GMTప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పై బీజేపీ అగ్రనేత - కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తనదైన శైలిలో ఆయన సెటైర్లు కూడా పేల్చారు. సంగారెడ్డి సభలో తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి విమర్శించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడైన రాహుల్ కు లేదని వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో కుటుంబ పాలనకు పునాది వేసిందే కాంగ్రెస్ అని, ఈ విషయాన్ని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో వారసత్వమే తప్ప జవసత్వం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి పార్టీ నాయకుడిగా వారసత్వ రాజకీయాలపై రాహుల్ గాంధీ మాట్లాడితే నవ్వొస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు.
జంతు వధపై కేంద్రం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పూర్తిగా సమర్తించారు. వ్యక్తిగత ఆహార అలవాట్లపై కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని, కొన్ని నియమనిబంధనలను మాత్రమే సవరించిందని అన్నారు. గోవధపై కాంగ్రెస్ హయాంలోనే పలు రాష్ర్టాల్లో ఆదేశాలు వెలువడ్డాయని తెలిపారు. అయినప్పటికీ కావాలనే రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని వెంకయ్య విశ్లేషించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, అందరినీ కలపుకొని రాష్ట్రపతి ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ అందరినీ విడగొట్టుకుంటూ వెళ్తుంటే, బీజేపీ సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నదని ఆయన అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/