Begin typing your search above and press return to search.
గాంధీ.. నెహ్రూ కుటుంబాలపై వెంకయ్య సెటైర్లు
By: Tupaki Desk | 13 May 2017 10:10 AM GMTవీలు చిక్కినపుడల్లా తన రాజకీయ ప్రత్యర్థులకు చురకలు అంటిస్తుంటారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. తాజాగా ఆయన మరోసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్ని లక్ష్యంగా చేసుకున్నారు. వారసత్వ రాజకీయాలు చేసే గాంధీ.. నెహ్రూ కుటుంబాలపై ఆయన సెటైర్లు వేశారు. తానేమీ వారసత్వ రాజకీయాల్ని నమ్ముకుని ఎదిగిన నాయకుడిని కాదని వెంకయ్య అన్నారు.
హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ.. తనకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరన్నారు. తాను గాంధీ.. నెహ్రూ అనే టైటిళ్లు పెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదని.. తన కుటుంబంలో ఎవర్వరూ పెద్దగా చదువుకోలేదని చెప్పారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి తాను నమ్ముకున్న సిద్ధాంతం.. పడ్డ శ్రమ కొన్ని ప్రధాన కారణాలైతే.. మరోవైపు మిత్రులు. అభిమానులు అందించిన సహకారం కూడా మరో ముఖ్య కారణం అని ఆయన అన్నారు.
ఐక్యరాజ్య సమతి ఆవాస సంఘానికి అధ్యక్షుడు కావడమనేది తనకు పెద్ద పదవిగా భావించడం లేదని.. అది తనకు దక్కిన అరుదైన గౌరవం అని ఆయన అన్నారు. ఈ గౌరవాన్ని స్వీకరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంచి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నట్లు వెంకయ్య చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతోందని.. వాహనాలు బాగా ఎక్కువైపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈ మధ్య లెక్క తీస్తే కోటి వాహనాలున్నట్లు తేలిందని.. ప్రతి ఇంట్లో తండ్రికో కారు.. తల్లికో కారు.. కొడుక్కో కారు.. కూతురికో కారు అన్నట్లు తయారైందని.. ఈ పరిస్థితి మారాలని ఆయనన్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో కారుండటం వల్ల ఏం జరిగిందో చూశామంటూ పరోక్షంగా మంత్రి నారాయణ కొడుకు ప్రమాద ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితి మారాలని.. యూరప్ తరహాలో సైకిళ్ల వాడకం పెరగాలని ఆయన సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/