Begin typing your search above and press return to search.
అంబానీ గురించి వెంకయ్య సెన్సేషనల్ కామెంట్
By: Tupaki Desk | 24 Sep 2016 1:42 PM GMTఅధికారంలో ఎవరున్నా అంబానీల గురించి నెగెటివ్ గా మాట్లాడ్డం అరుదు. కాంగ్రెస్ వాళ్లయినా.. బీజేపీ వాళ్లయినా అంబానీల గురించి మాట్లాడేటపుడు కొంచెం జాగ్రత్త వహిస్తారు. ఐతే బీజేపీ అగ్ర నేత.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాత్రం అంబానీల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ.. అంబానీల గురించి నెగెటివ్ గా మాట్లాడారు.
అదానీ.. అంబానీల ఎదుగుదలకు తమ పార్టీకి ముడిపెడుతూ కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై వెంకయ్య స్పందించారు. అదానీ.. అంబానీలను కాంగ్రెస్ పార్టీనే తయారు చేసిందని అన్నారు. వారి హయాంలోనే వాళ్లిద్దరూ ఎదిగేలా చేశారని.. కానీ ఇప్పుడు తమ పార్టీకి వారికి లింక్ పెడుతూ ఎలా మాట్లాడతారని వెంకయ్య ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో మేడం నిర్ణయిస్తే ప్రధాని పాటించేవాడని.. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తే ప్రధాని పాటిస్తున్నాడని వెంకయ్య అన్నారు. బీజేపీ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను దేశానికి ఇచ్చి.. రెండో ప్రాధాన్యతను పార్టీకి.. చివరగా వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి భిన్నమన్నారు. వంశపారంపర్య రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఒక దుష్టశక్తి అన్న వెంకయ్య.. ఆ పార్టీతో పాటు వామపక్షాలు కూడా అవినీతికి కొమ్ముకాశాయని ఆరోపించారు. ఉగ్రవాదం ఏ మతానికి సంబంధించింది కాదు. కొంతమంది మాత్రం ఉగ్రవాదానికి మతం రంగు పులిమేందుకు యత్నిస్తున్నారని వెంకయ్య మండిపడ్డారు.