Begin typing your search above and press return to search.
రాజ్యసభలో సమ్మక్క.. వెంకయ్య థ్రిల్
By: Tupaki Desk | 5 Feb 2018 10:43 AM GMTపెద్దల సభగా పేరొందిన రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో అతిపెద్ద జాతరగా పేరొంది మేడారం జాతరపై ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు.. రాజ్యసభలో ప్రస్తావించారు. మేడారం జాతర బ్రహ్మాండంగా జరిగిందన్న వెంకయ్య నాయుడు సమ్మక్క - సారలమ్మ జాతర ఔనత్యాన్ని సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా గత శుక్రవారం మేడారం జాతరను సందర్శించిన అనుభావాన్ని సభ్యులతో ఆయన పంచుకున్నారు.
దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ర్టాల నుంచి కోటి 50 లక్షల మంది జాతరకు హాజరైనట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ జాతరను వెంకయ్యనాయుడు మినీ కుంభమేళాగా వర్ణించారు. గిరిజనుల జాతర ఎంతో గొప్పగా జరిగిందన్నారు. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఈ జాతరలో పాల్గొనడం థ్రిల్లింగ్ గా ఫీలయ్యానని చెప్పారు. భక్తులకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని వెంకయ్య పేర్కొన్నారు.
కాగా, గత శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మేడారం సమ్మక్క-సారలమ్మను సందర్శించుకున్నారు. ఈసందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న మేడారం జాతర ఆధ్యాత్మిక సంపదకు గుర్తింపుగా నిలుస్తోందని ప్రశంసించారు. ` దేవతల ఆరాధనతో జీవితాలు సుఖమయం అవుతాయి. ఆదివాసీ కుంభమేళ మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరు హర్షణీయం. జాతరకు రావడం సంతోషంగా ఉంది. మేడారానికి రావడాన్ని బాధ్యతగా - అవతారమూర్తులను దర్శించుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఆది, వేద కాలం నుంచి వస్తున్న ఆచారాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జాతరపై యావత్ దేశం దృష్టి పడాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంత పెద్దఎత్తున జనసమీకరణ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి భారీస్థాయిలో జనం జాతరకు వస్తున్న తీరు అద్భుతం. జనం భక్తిని ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. 1986లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు. గతంలో ఓసారి సాధారణ పౌరుడిగా జాతరకు వచ్చాను` అని ఆయన చెప్పారు.